జనసేనాని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ డ్రగ్స్ మాఫియాపై స్పందిస్తూ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఉదంతాన్ని బయటకు తీశారు. విజయనగరం నేతలు, కార్యకర్తల మీటింగ్ లో హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలోని ఉత్తరాంధ్ర-ఒడిషా బార్డర్ లో పెద్ద ఎత్తున గంజాయి సాగు అవుతోందని.. వాటిని ఏపీ ప్రభుత్వం నియంత్రించడం లేదని పవన్ ఆరోపించారు. తాను టీడీపీ హయాంలోనూ దీనిపై స్పందించానన్నారు.
కేవలం 13 గ్రాముల గంజాయి షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ స్నేహితుడి దగ్గర దొరికితేనే అతడిని 27 రోజులు జైల్లో పెట్టారని.. సంబంధం లేకున్నా జైల్లో ఉంచారని.. కానీ ఏపీలో 5వేల క్వింటాళ్ల గంజాయి పట్టుబడితే ఎంతమందిని ఎన్నిరోజులు జైల్లో పెట్టాలని జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తొలిసారి షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ డ్రగ్స్ కేసుపై స్పందించారు.
ఉత్తరాంధ్ర అనగానే వెనుకబాటు తనానికి, డ్రగ్స్ కు ఆలవాలంగా భావిస్తున్నారని.. కానీ 13 జీవనదులున్న ఉత్తరాంధ్ర గొప్పతనాన్ని ఎవరూ నమ్మడం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.
వైసీపీ నేతలకు తాను భయంతో వణికిపోతున్నానని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ఎంత బెదిరించినా బెదిరే వాడిని కాదన్నారు. ఉత్తరాంధ్ర యువత ఈ గంజాయి సాగును వదిలి అభివృద్ధి బాటలో నడవాలని.. ఉద్యోగాలు చేసుకోవాలని ఆకాంక్షించారు.