ఏపీ రాజకీయ చరిత్రలో ఎన్టీఆర్ అంటే ఒక ధ్రువతార.. ఈ సినీ తార తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ఏపీలో అధికారం కొల్లగొట్టారు. అనాధిగా కాంగ్రెస్ పాలనలో మగ్గిన ఆంధ్రులకు విముక్తి కల్పించారు. సినిమాల్లో అగ్ర స్థాయికి వెళ్లి రాజకీయాల్లోనూ అంతే స్థాయికి ఎదిగిన వారిలో ఎన్టీఆర్ అగ్రగణ్యుడు.. తెలుగు నేల చరిత్రలో ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా మిగిలిపోతోంది.
ఆ ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగు నేలపై రాజకీయాల్లోకి వచ్చిన వారు ఎవరూ అంతగా ఎదగలేదు.. మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలు పెడితే ఆయన తమ్ముడు పవర్ స్టార్ వరకూ అందరూ హిట్ కానివారే.. ఇక మధ్యలో వచ్చి కొందరు హీరోలు - సినీ ప్రముఖుల పార్టీల కింద పనిచేసిన వారే..
తాజాగా సీనియర్ ఎన్టీఆర్ అప్పట్లో ఏపీలో అధికారంలోకి రావడం.. తాను ఓడిపోవడంపై జనసేనాని పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గ కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ హాట్ కామెంట్స్ చేశారు..
‘పార్టీ పెట్టగానే అధికారంలోకి రావడం అనేది అందరికీ సాధ్యం కాదని.. అప్పటి పరిస్థితుల కారణంగా ఒక్క ఎన్టీఆర్ కే అది సాధ్యమైందని’ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఓటమి అనేది సహజమని.. ఓటమికే కృంగిపోయే వ్యక్తిని కాదని జనసేన అధినేత స్పష్టం చేశారు. దూర దృష్టితోనే పార్టీ పెట్టానని తెలిపారు.