కన్ఫర్మ్: జనసేనలోకి చిరంజీవి రారట

Update: 2017-03-14 11:29 GMT
జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. తాను మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచే పోటీ చేస్తానని తెలిపారు.  అంతేకాదు... పవన్, చిరంజీవి అభిమానులు ఎంతగానో చర్చించుకుంటున్న ఇంకో అంశంపైనా ఆయన క్లారిటీ ఇచ్చారు. తమ పార్టీలోకి తన అన్నయ్య చిరంజీవి రారని ఆయన స్పష్టం చేశారు.
    
కాగా ప్రభుత్వాలు తీరుపై ఆయన విమర్శలు చేశారు. వారు చేపట్టే పధకాలు అట్టడుగు వర్గాలకు అందడం లేదని విమర్శించారు.  పేదలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందినప్పుడే ఆ ప్రభుత్వాలు విజయం సాధించినట్టని ఆయన అన్నారు. తమ పార్టీ అంతిమ లక్ష్యంగా ప్రజాసమస్యల పరిష్కారమని ఆయన అన్నారు. అధికారం తమ లక్ష్యం కాదని ఆయన స్పష్టం చేశారు.  ధనప్రవాహం లేని రాజకీయాలు కావాలని తనకు కూడా ఉందని, అయితే అది ఎంతవరకు సాధ్యమో ప్రయత్నించి చూస్తే కానీ తెలియదని ఆయన అన్నారు.
    
ప్రజా ఉద్యమ కారిణి ఇరోం షర్మిళ ఓటమి తనను బాధించిందని పవన్ కల్యాణ్ తెలిపారు. గోపీచంద్ రాసిన కథ గుర్తుకొచ్చిందని ఆయన చెప్పారు. తన వరకు వస్తే విలువలు ఉండవన్నది ప్రజలు నిరూపించినట్టు అనిపించిందని పవన్ పేర్కొన్నారు. ఆమెకు ప్రజలు మద్దతు తెలపాల్సిందని ఆయన చెప్పారు. అనుభవం ఉన్నవారి అవసరం పార్టీకి ఉందని చెప్పిన పవన్ కల్యాణ్, అయితే వారిలో ప్రజాసమస్యలపై సరైన అవగాహన ఉండాలని, వాటి పరిష్కారానికి నిస్వార్థంగా పని చేసేతత్వం ఉండాలని పవన్ తెలిపారు.

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News