గాజువాక బరిలో దిగుతున్న జనసేన అధినేతలో ప్రజారాజ్యం బెరుకు కనిపిస్తోంది. ఆయన రెండు నియోజకవర్గాలకు పోటీ పడుతున్నారన్నది తాజా వార్త. రెండు నియోజకవర్గాల పోటీ అంటే అది భయానికి చిహ్నం. ఎందుకంటే రెండు చోట్లా గెలిచినా తర్వాత ఒక దానికి రాజీనామా చేయకతప్పదు. అలాంటపుడు ఎందుకు ఈ పోటీ... ఒక చోట ఓడిపోయినా ఇంకో చోట అయినా గెలిస్తే పరువు దక్కుతుంది. ఇక రెండు చోట్లా ఓడిపోతే అంతకు మించి అవమానం ఉండదు.
గతంలో చిరంజీవి కూడా రెండు చోట్ల పోటీ చేశారు. కాపులు అధికంగా ఉండే పాలకొల్లు - తిరుపతి నియోజకవర్గాల్లో పోటీ చేస్తే సొంత జిల్లా వారు ఓడించారు. తిరుపతి అభిమానులు గెలిపించారు. అయినా ఇది చిరు అవమానంగానే భావించారు. ఇపుడు పవన్ కూడా దాదాపు అదే వ్యూహంలో ఉన్నారు.
గాజవాక పవన్ కు బాగా పట్టున్న ప్రాంతం. అయినా కూడా దానిపై పవన్‌కు ఎక్కడో కొడుతోంది. అందుకే భీమవరంలో కూడా పోటీచేయాలని నిర్ణయించారు. ** పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం - విశాఖ నగర పరిధిలోని గాజువాక శాసనసభ స్థానాల నుంచి బరిలోకి దిగనున్నారు** అంటూ ట్విట్టర్ జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. తాను రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నట్టు మంగళవారం ఉదయం పవన్ కల్యాణ్ కూడా తెలిపారు.
అయితే, దీనిపై భిన్నాప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ రెండు ఎమ్మెల్యే సీట్లలో కూడా ఒక ఎంపీ సీటు, ఒక ఎమ్మెల్యే సీటుకు పోటీ చేసే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల అసెంబ్లీలో కుదరకపోతే పార్లమెంటుకు - పార్లమెంటులో కుదరకపోతే అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఉండేదని... దీనివల్ల పార్టీ నిలబెట్టుకోవడానికి కొత్త మార్గాలు దొరికేవని అంటున్నారు.
ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినపుడు పవన్ ఊపు కనిపించినా ఎన్నికలు దగ్గరపడే కొద్దీ సరైన అభ్యర్థులు కూడా దొరక్క పార్టీ శ్రేణులు డీలాపడుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చిన డబ్బులు ఖర్చుపెట్టుకునే శక్తి కూడా లేని వాళ్లు పాతికశాతం ఉన్నారు పార్టీలో. మినిమం వంద స్థానాల్లో ఈ పార్టీ డిపాజిట్లు కోల్పోవడం గ్యారంటీ అంటున్న నేపథ్యంలో పవన్ రెండు చోట్ల గెలిస్తే విశేషమే.