గతం గుర్తులేనట్టుంది..: ఓడిన వ్యక్తి మళ్లీ పోటీ చేస్తాడట..

Update: 2020-02-17 11:00 GMT
సినీ పరిశ్రమ నుంచి వచ్చి రాజకీయాల్లో కొనసాగుతున్న అపరిపక్వ రాజకీయ నాయకుడు గత ఎన్నికల్లో ఘోర పరాజయం పొందాడు. రెండు చోట్ల పోటీ చేసి మరీ పరాభవం ఎదుర్కొన్నాడు. అలాంటి వ్యక్తి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాడు. ఇప్పుడు మరో ప్రాంతంలో తాను పోటీ చేసి పార్టీ శ్రేణులకు బలం ఇచ్చేలా చేస్తానని ప్రకటించిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.

ఆలస్యంగా మేల్కొని కొత్తగా రాజధాని ఉద్యమం లో పవన్ కల్యాణ్ వచ్చాడు. ఈ సందర్భం గా రాజధాని ప్రాంతాల్లో పర్యటించాడు. అనంతరం అమరావతి లో పర్యటించి తన పార్టీ నాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల కోసం అవసరమైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ప్రకటించాడు. అమరావతిలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పార్టీ కేడర్‌కు అధికార పార్టీ నుంచి వస్తున్న వేధింపులు తిప్పికొట్టాలను పవన్ సూచించాడు.

అప్రజాస్వామికంగా వార్డుల విభజన, ఏకపక్షంగా పట్టణం లో గ్రామాల విలీనం పై అవకాశం ఉంటే న్యాయ పోరాటం చేస్తామని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించాడు. అధికార పార్టీ వేధింపులపై అవసరమనుకుంటే స్వయంగా వచ్చి తాడేపల్లిగూడెం లో కూర్చుంటానని తెలిపారు. పార్టీ శ్రేణుల కోరిక మేరకు అవసరమైతే గూడెంలో పోటీ చేస్తానంటూ చెప్పాడు. భారతీయ జనతా పార్టీ తో సంప్రదింపులు జరిపిన తర్వాత మునిసిపల్‌ ఎన్నికల్లో పార్టీ విధివిధానాలను వెల్లడిస్తామని ప్రకటించారు. ఆ మేరకు పార్టీ శ్రేణులు కష్టపడాలని కోరారు. ఈ స్థానం నుంచి పోటీ చేస్తే ఎలా గెలుస్తాడో ఆయనకే తెలియాలి. అయినా అప్పటివరకు ఆయన రాజకీయాల్లో కొనసాగుతాడా? లేదా సినిమాలతో బిజీ అవుతాడ అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఇటీవల అప్పులు పెరిగాయని.. ఆ అప్పులు తీర్చుకునేందుకు తాను సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించాడు. ఈ మేరకు మూడు సినిమాలను అంగీకరించి ప్రస్తుతం షూటింగ్ లకు కూడా హాజరవుతున్నాడు.
Tags:    

Similar News