పవిత్రమైన గంగా నది పరిరక్షణకు ప్రాణాలు త్యాగం చేసిన అగర్వాల్ అడుగు జాడల్లో నడిచేందుకు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనవంతు సాయం చేయనున్నాడు. అందుకు ఆయన గంగానది ప్రక్షాళన కోసం పోరాడి అమరులైనవారిని స్మరించుకునే పనిలో హరిద్వార్‌లో మాకాం వేశారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని, సినిమాల్లో పవనిజం సృష్టించిన పవన్ కళ్యాణ్ కు గంగానది అంటే ఎంతో ప్రత్యేకమైన అభిమానమట. అందుకే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిద్వార్ లో ఉన్నారు.
గంగానది ప్రక్షాళన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు కోల్పోయిన జెడి అగర్వాల్ ప్రధమ వర్ధంతి సందర్భంగా అయన సమాధిని సందర్శించేందుకు పవన్ కళ్యాణ్ హరిద్వార్ వెళ్లారు. అక్కడ మాత్రి సదన్ లో జరిగిన కార్యక్రమాలలో పాల్గొన్నారు. గంగానది ప్రక్షాళన కోసం తన వంతుగా పోరాటం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. దక్షిణాది నుంచి తమకు మద్దతు లభించడం లేదని పవన్ దక్షిణాది నుంచి కూడా మద్దతు లభించేలా చూడాలని గంగాప్రక్షాళన కోసం కృషిచేస్తున్న సామాజిక వేత్తలు పవన్‌ను కోరారు.
సామాజిక వేత్తల కోరికపై పవన్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈ ఉదయం హరిద్వార్ లో జరిగిన పవిత్ర గంగానది హారతి కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం హరిద్వార్ వెళ్ళారు. అక్కడ మాత్రి సదన్ లో సాధారణ వ్యక్తిలా గడిపారు. మామూలు గదిలో తన రోజు వారి కార్యక్రమాలను తానే చేసుకున్నారు. గంగానది ప్రక్షాళణ కోసం భారత ప్రధాని నరేంద్రమోడీ గతంలో అనేక వాగ్ధానాలు చేశారు. కానీ అవి ముందుకు సాగడం లేదు.. ఎంతో పవిత్రమైన గంగా నది రోజు రోజుకు కాలుష్య కోరల్లో చిక్కుకుని విషతుల్యం అవుతోంది. గంగానదిని పవిత్ర నదిగా ప్రజలు భావిస్తున్నారు కానీ దాన్ని అపవిత్రం చేస్తోంది కూడా భక్తులే.
దీనికి తోడు గంగానది పరివాహక ప్రాంతంలో వెలిసిన పరిశ్రమల కాలుష్యంతో గంగానది కాలుష్యంతో నిండిపోయింది. దీంతో ప్రక్షాళణకు సామాజిక వేత్తలు నడుం బిగించారు. దీనికి జేడీ అగర్వాల్ ఆద్యుడు. ఆయన చూపిన తోవలో అనేక మంది సామాజిక వేత్తలు నడుస్తున్నారు. కాకుంటే దక్షిణాది నుంచి గంగానది ప్రక్షాళణలో ఎవ్వరు పాల్గొనడం లేదు. అయితే దీనికి పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని ఆయనను సామాజిక వేత్తలు సంప్రదించగా ఆయన ఆ ఉద్యమంలో భాగం అయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడమే కాకుండా జేడీ అగర్వాల్ ప్రధమ వర్థంతిలోనూ పాల్గొన్నారు. ఇకముందు గంగానది ప్రక్షాళణలో తనతో పాటు తన సైన్యం పాల్గొంటుందని పవన్ కళ్యాణ్ సామాజికవేత్తలకు మాటిచ్చారు.