అదేంది ప‌వ‌న్‌..మ‌హిళ‌ల మీద అలా మాట్లాడావ్‌?

Update: 2018-08-03 05:10 GMT
త‌న నోటి నుంచి వ‌చ్చే ప్ర‌తి మాట‌ను ఆచితూచి అన్న‌ట్లు మాట్లాడ‌తాన‌ని.. త‌న గొంతు నుంచి ఒక మాట రావ‌టానికి ముందు తాను స‌వాల‌క్ష ఆలోచిస్తాన‌ని.. అంత‌ర్గ‌తంగా చాలా మ‌ధ‌నం జ‌రుగుతుంద‌ని.. ఆ త‌ర్వాతే తాను మాట్లాడ‌టం ఉంటుంద‌ని త‌న మాట‌ల గురించి ప‌వ‌న్ అదే ప‌నిగా చాలా గొప్ప‌లు చెప్పుకోవ‌టం క‌నిపిస్తుంది.

ప్ర‌తి ఒక్క‌రి మాట‌లోనూ త‌ప్పుల్ని వెతికే ఆయ‌న‌.. తాజాగా మ‌హిళ‌ల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగానే కాదు.. పుసుక్కున అలా అనేశావేంది ప‌వ‌నా? అన్న భావ‌న క‌లగ‌క మాన‌దు. తన పార్టీ మ‌హిళా విభాగ‌మైన వీర మ‌హిళ కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన మ‌హిళ‌ల‌తో క‌లిసి హైద‌రాబాద్‌లోని పార్టీ కార్యాల‌యంలో ప్ర‌సంగించిన ప‌వ‌న్‌.. జ‌న‌సేన మ‌హిళా విభాగాన్ని పెంచ‌క‌పోవ‌టానికి కార‌ణం ఉంద‌ని చెబుతూ.. ఊహించ‌ని రీతిలో వ్యాఖ్య‌లు చేశారు.

"జ‌న‌సేన మ‌హిళా విభాగాన్ని పెంచ‌క‌పోవ‌టానికి కార‌ణం ఉంది. మ‌హిల‌కు కోపం ఎక్కువ‌. ట‌క్కున ఒక మాట అనేయొచ్చు. అది ఇళ్ల‌ల్లో అయితే స‌రిపోతుంది కానీ రాజ‌కీయాలకు వ‌చ్చేస‌రికి కుద‌ర‌దు. స‌ర్దుకుపోవాలి" అని వ్యాఖ్యానించారు. ప‌వ‌న్ మాట‌ల్ని చూస్తే.. మ‌హిళ‌లు తొంద‌ర‌ప‌డి మాట్లాడ‌తారు.. ఎందుకంటే వారికి కోపం ఎక్కువ‌న్న అర్థం వ‌చ్చేలా ఉంది. మ‌హిళ‌ల ప‌ట్ల త‌న‌కు అమిత‌మైన గౌర‌వ మ‌ర్యాద‌ల‌ని చెప్పే ప‌వ‌న్‌.. యావ‌త్ మ‌హిళ‌ల్ని ఉద్దేశించి అలాంటి స్టేట్ మెంట్ ఇవ్వ‌టం ఏమిట‌న్న ప్ర‌శ్న వ్య‌క్త‌మ‌వుతోంది.

అంతేకాదు.. సేవా రంగంలోకి వ‌చ్చే మ‌హిళ‌లను ఉద్దేశించి ప‌వ‌న్ చేసిన సూచ‌న పైనా విమ‌ర్శలు వెల్లువెత్తే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. సేవా రంగంలోకి వ‌చ్చే మ‌హిళ‌ల‌కు సామాజిక వెన్నుద‌న్ను అవ‌స‌ర‌మ‌ని.. మీ ఇల్లు.. పిల్ల‌ల బాధ్య‌త‌లు వ‌దిలి రావొద్ద‌ని.. అవి చూసుకుంటూ వీలు చిక్కిన స‌మ‌యంలో ప్ర‌ణాళికాబ‌ద్ధంగా పార్టీ కోసం ప‌ని చేయాల‌ని కోర‌టం కూడా స‌రికాద‌న్న మాట వినిపిస్తోంది.

చూస్తుంటే.. రాజ‌కీయాల విష‌యంలో మ‌హిళ‌లు సీరియ‌స్ గా దృష్టి సారించాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌ట్లుగా ప‌వ‌న్ వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఇంటిని.. ఇష్ట‌మైన రంగాన్ని బ్యాలెన్స్ చేసుకునే స‌త్తా ఈనాటి మ‌హిళ‌ల‌కు ఉంద‌ని.. ఆ దిశ‌గా అడుగులు వేయాల‌న్న ఉత్తేజ మాట‌ల స్థానే.. బాధ్య‌త‌ల పేరు చెప్పి భ‌య‌పెట్ట‌టం ఏమిట‌న్న క్వ‌శ్చ‌న్ వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News