పవన్ కూతురు పేరు ఎవరు పెట్టారో తెలుసా.?

Update: 2018-08-14 06:26 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తన ఫ్యామిలీ గురించి బహిరంగంగా చెప్పుకోరు.. మొదటి నుంచి ఆయన స్వభావం అంతే.. సినిమాల్లో వెలుగు వెలిగినప్పుడు కూడా తన పిల్లలు అకీరా - ఆద్యలను సినిమా ఫంక్షన్లకు తీసుకువచ్చే వారు కాదు.. వారు వారిలాగే ఉండాలని ప్రభావితం కాకూడదనే ఉద్దేశంతో ఇలా చేసేవాడినని చాలా సార్లు చెప్పాడు.

తాజాగా పవన్ కళ్యాణ్ భీమవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి స్థానిక చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ తన పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి తనకు చిన్నప్పుడు ఒక బైబిల్ ను ఇచ్చారని.. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ.. మనస్ఫూర్తిగా కలుపుకునే సంస్కారం అప్పటి నుంచే అలవడిందని చెప్పుకొచ్చారు. ఆ బైబిల్ ను ఇప్పటికీ తన దేవుడి గదిలో భగవద్గీత పక్కన పెట్టుకుంటానని పవన్ వివరించాడు.

మతసామరస్యాన్ని తాను పాటిస్తానని చెబుతూ పవన్ తన కూతురు పోలీనాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తన కూతురుకు ‘పోలీనా’ అని పేరు పెట్టింది ఎవరో చెప్పుకొచ్చాడు.    వాళ్ల అమ్మ స్వస్థలమైన రష్యా దేశం సెయింట్ పీటర్స్ బర్గ్ లోని ఓ క్రిస్టియన్ ఫాదర్ ఈ పేరు పెట్టాడని వివరించాడు. ఇలా తండ్రి గురించి, కూతురు గురించి పవన్ చెప్పుకొని జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నాడు. 
Tags:    

Similar News