ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ తన పొలిటికల్ జర్నీపై క్లారిటీ ఇచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. టీడీపీతో తనకు ఎలాంటి రహస్య అజెండాలు లేవని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఉద్దేశపూర్వకంగానే పక్కనపడిందని అన్నారు. ప్రత్యేక హోదాకు తాను ఎలాంటి బ్రేక్ ఇవ్వలేదని తెలిపారు. హోదాపై తన పోరాటం ఆగిపోలేదని దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేది చర్చిస్తున్నట్లు వివరించారు.
రాబోయే రెండు మూడునెలల్లో పార్టీ శిక్షణా తరగతులు పూర్తవుతాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. అందుకే రాబోయే అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు.తాను పాదయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నానని, కానీ వాస్తవంగా అది సాధ్యం కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలో ఎవరి బలాలు వారికి ఉన్నాయన్నారు. తన బలం ఏంటనేది ప్రజల్లోకి వెళ్లిన తర్వాతే తెలుస్తుందని తెలిపారు. కాపు రిజర్వేషన్ల అంశం సున్నితమైందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. కాపు రిజర్వేషన్ల డిమాండ్ దశాబ్దాలుగా ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశాన్ని పట్టించుకోలేదన్నారు. కాపుల రిజర్వేషన్లపై టీడీపీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొందన్నారు. బీసీలకు నష్టం జరిగితే దాన్ని ఎలా అధిగమించాలో చూడాలన్నారు. లా అండ్ ఆర్డర్‌తోనే సమస్యలన్నీ పరిష్కారం కావని పవన్ కల్యాణ్ అన్నారు.కాపు రిజర్వేషన్లు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఎందుకు ఎవరూ వ్యతిరేకించలేదన్నారు. శాంతియుతంగా ముద్రగడ పాదయాత్ర చేస్తానంటే అనుమతి ఇవ్వాలన్నారు. తనకు కులాన్ని ఆపాదించవద్దని పవన్ పరోక్షంగా చెప్పారు.