జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కొడుకును ఆదుకోవాల్సిన బాధ్యతను మరిచిపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేస్ుతున్నాడు మొళ్ల వీరబాబు అనే బాధితుడు. పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేనకు మద్దతుగా నిర్వహించిన బైక్ ర్యాలీలో తీవ్రంగా గాయపడిన రాజమనోహర్ ప్రస్తుతం ఆసుపత్రిలో దయనీయ స్థితిలో ఉన్నాడు. వెంటనే పవన్ కళ్యాణ్ ఆదుకోకుంటే తమ బిడ్డ దక్కడని వీరబాబు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు.
వీరబాబు కుటుంబానికి పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం హుకుంపేట. గత నెల 9న దేవరపల్లిలో పవన్ అభిమానుల బైక్ ర్యాలీలో వీరబాబు కొడుకు రాజ మనోహర్ కూడా పాల్గొన్నాడు. ఆ సందర్భంగా అతడి బైకుని ఇంకో బైక్ ఢీకొట్టింది. అతను కింద పడిపోగా.. మీది నుంచి మరో బైక్ వెళ్లింది. దీంతో రాజమనోహర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్నేహితులు అతడిని రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కిడ్నీ తీవ్రంగా దెబ్బ తినడంతో దాన్ని తొలగించి ప్రాణాలు కాపాడగలిగారు.
ఐతే పవన్ కోసం నిర్వహించిన ర్యాలీలో ప్రమాదానికి గురైతే.. రాజమనోహర్ చికిత్సకు ఆయన నుంచి ఎలాంటి సాయం అందలేదని వీరబాబు అంటున్నాడు. జనసేన నాయకులు.. కార్యకర్తలు కూడా తన కొడుకును పట్టించుకోలేదన్నాడు. రాజ మనోహర్ స్నేహితులు కొవ్వూరు సభలో పవన్ కు అతడి ప్రమాద ఫొటోలు చూపించారట. కానీ మనోహర్ ఎలా ఉన్నాడని కూడా పవన్ అడగలేదని.. తాను రూ.5 లక్షలు అప్పు చేసి బిడ్డను కాపాడుకున్నానని.. ప్రస్తుతం రాజమనోహర్ ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ వచ్చిందని.. అతడి పరిస్థితి విషమంగా మారుతోందని అంటున్నాడు వీరబాబు. గత పది రోజులుగా రాజమహేంద్రవరంలోని ఆస్పత్రిలోనే ఉంటున్నామని.. తన బిడ్డను కాపాడుకోవడానికి దాతలు ఎవరైనా సాయం చేయాలని.. పవన్ ఇప్పటికైనా స్పందించి ఆదుకోవాలని వీరబాబు విజ్ఞప్తి చేస్తున్నాడు.