పవన్ కల్యాణ్ చాలా సింపుల్ తన పార్టీ బహిరంగ సభలో ఎడాపెడా విమర్శలు గుప్పించి.. అంతటితో ఊరుకున్నారు. అప్పటినుంచి అమరావతి, విజయవాడలోనే తిష్టవేసి.. లోకేష్ ను మాత్రమే కాదు.. మొత్తం తెలుగుదేశం ప్రభుత్వ పనితీరును కూడా తాను టార్గెట్ చేస్తున్నట్లుగా.. సంకేతాలు ఇచ్చేశారు. మరి ఇన్నాళ్లూ తెలుగుదేశానికి తాము మిత్రులం అనుకుంటూ వచ్చిన పవన్ అభిమానులు ఇప్పుడు భయంకరమైన కన్ఫ్యూ.జన్లో ఉన్నారు.
ఎందుకంటే.. ఇన్నాళ్లుగా తెలుగుదేశం వాళ్లతో నియోజకవర్గాల్లో పవన్ అభిమానులకోటాలో రకరకాల ఆబ్లిగేషన్లు చేయించుకున్నారు. ఇప్పుడు వ్యవహారం అంతా బెడిసి కొడుతోంది. తెదేపా తో మాత్రం దూరం అని అర్థమవుతోంది.
అడపాదడపా చాన్సు వస్తే జగన్ పార్టీని కూడా ఓ ఆటాడుకుంటున్నారు. పవన్ మాటల్ని బట్టి.. వైకాపా కూడా శత్రు పార్టీనే అని అర్థమవుతోంది. మరోవైపు ఆ పార్టీ ఎంపీ వరప్రసాద్.. పవన్ తనతో మాట్లాడి.. వైసీపీకి మద్దతు ఇవ్వబోతున్నట్లు చెప్పారని అన్నారు. దానికి తమ నాయకుడి దగ్గరినుంచి కౌంటర్ లేదు. ఖండించలేదు.
మరోవైపు భాజపా తో పవన్ కుమ్మక్కయ్యాడని చంద్రబాబు అంటాడు. దానిని కూడా పవన్ ఖండించలేదు. అలాగని భాజపా వారి వైఫల్యాలను తిట్టడమూ లేదు.
భాజపాతో ఫ్రెండేనేమో అని అనుకునేలోగానే.. ఆయన వామపక్షాలతో కలిసి ప్రజాపోరాటాలుచేస్తాం.. అని., తనలో సోషలిస్టు భావజాలం ఉన్నదని ప్రకటించాడు...!
ఇన్ని రకాల కోణాల్లో పరిణామాలు జరుగుతూ ఉండగా.. తాము ఎవరికి మిత్రులో ఎవరికి శత్రువులో తెలియక పవన్ కల్యాణ్ అభిమానులు సతమతం అయిపోతున్నారట. అధినేత క్లారిటీ ఇచ్చే వరకూ ఈ గందరగోళం తప్పదని వారు బాధపడుతున్నారట.