పవనా నీకెందుకు రాజకీయాలు.. చక్కగా చొక్కా నలగకుండా ఏసీ క్యారవాన్ లో ఎంజాయ్ చేసేయక.. రాజకీయాల రొచ్చు అవసరమా? అంటూ తెగ మాట్లాడేవారు చాలా మంది కనిపిస్తారు. రాజకీయాలకు పవన్ పనికి రారన్న విషయాన్ని ఏపీ ప్రజలు తేల్చేసినట్లుగా ఆయనవైరి వర్గం వ్యాఖ్యలు చేస్తుంటే.. పవన్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.
జనసేన పార్టీని.. పవన్ నాయకత్వాన్ని ఏపీ ప్రజలు పిచ్చ లైట్ గా తీసుకున్నారన్న విసయం పలు నియోజకవర్గాల్లో నమోదైన ఓట్లు ఈ సంగతి తెలిసే పరిస్థితి. పెద్ద ఎత్తున జనసేన అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదని చెప్పక తప్పదు. ఇలాంటి వేళ.. పవన్ అభిమానుల స్పందన వేరుగా ఉంది.
బ్యాక్ టు పెవిలియన్ అన్నట్లుగా మళ్లీ సినిమాల్లోకి వెళ్లమని పవన్ ఫ్యాన్స్ అస్సలు చెప్పట్లేదు. భారీ బ్యాంగ్ తో తీసిన తొలి సినిమా అట్టర్ ప్లాప్ అయితే ఎలా ఉంటుందో..? అచ్చం అలానే ఉంది పవన్ తాజా పరిస్థితి. అయితే.. ఈ సమయంలో పవన్ ఫ్యాన్స్ మాత్రం అందుకు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. ఏం ఫర్లేదు అన్నయ్య.. గెలిచే వరకూ రాజకీయాల్ని వదిలేయొద్దంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
పార్టీ ఫండ్ కి ఇబ్బందిగా ఉందా? ఏం ఫర్లేదు.. మా జీతాల్లో నుంచి ప్రతి నెలా కొంతమొత్తాన్ని ఇచ్చేందుకు సైతం సిద్ధమవుతున్నారు. మొదటి ప్రయత్నంలో కొన్ని తప్పులు జరిగాయని.. పోరాడితే పవన్ నుకచ్ఛితంగా ప్రజలు నమ్మే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రజారాజ్యాన్ని విలీనం చేసి చిరంజీవి తప్పు చేశారని.. ఆ తప్పును మాత్రం పవన్ రిపీట్ చేయొద్దని కోరుకుంటున్నారు.
తాజా ఎదురైన ఓటమికి కుంగిపోయిన.. వెన్ను చూపించేసి సినిమాలకు మాత్రం రావొద్దని వారు కోరుకుంటున్నారు. సినిమాల్లోకి వచ్చి హీరోయిజం చూపిస్తే చూడలేమని తేల్చి చెబుతున్నారు. ఈ విషయాల్ని పవన్ ట్విట్టర్ ఫీడ్ చూస్తే అర్థమయ్యే పరిస్థితి. ఈ తరహా ఫ్యాన్స్ పవన్ కు మాత్రమే సొంతమన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మరి.. ఫ్యాన్స్ ఇచ్చిన స్ఫూర్తితో పవన్ ఎంతలా చెలరేగిపోతారో చూడాలి.