జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కోపం వచ్చింది. ఏపీ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయమే దీనికి కారణం. దేవాలయాల భూముల్ని అమ్మకానికి పెడుతున్నారన్న సమాచారంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. వివాదంగా మారుతున్న కర్నూలు జిల్లా మంత్రాలయం మఠం భూముల అమ్మకాల అంశంపై పవన్ తన స్టాండ్ ను క్లియర్ గా చెప్పేశారు. ఏపీ సర్కారుపై తీవ్రంగా విమర్శిస్తున్న పవన్.. మఠం భూముల్ని నడి బజార్లో అమ్మకానికి పెడతారా? అని ప్రశ్నిస్తున్నారు.
మంంత్రాలయం మఠం భూముల్ని అమ్మకానికి పెట్టింది జగన్ సర్కారు కాదని.. ఆ వ్యవహారం చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే మొదలైనట్లుగా చెబుతున్నారు. అప్పట్లో వచ్చిన ప్రతిపాదన ఇప్పుడు కార్యరూపం దాల్చినట్లుగా చెబుతున్నారు. దీనిపై పవన్ తాజాగా స్పందిస్తూ.. ‘మంత్రాలయం మఠానికి చెందిన 208 ఎకరాల భూముల బహిరంగ వేలం.. ఆస్తుల అమ్మకాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దేవాదాయ శాఖకుచెందిన భూములను ప్రభుత్వం కేవలం ట్రస్టీగా మాత్రమే వ్యవహరిస్తోంది. ఆస్తుల్ని సంరక్షించాలే కానీ అమ్ముకోవటానికి వీల్లేదు’’ అని స్పష్టం చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల్ని అమ్మకాలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో అమ్మకాల్ని ఆపుచేసిన వైనాన్ని గుర్తు చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో 888ను తీసుకొచ్చిందన్న పవన్.. కొన్ని ఆలయాల భూముల్ని ఏ రీతిలో అయితే అమ్మకుండా నిర్ణయం తీసుకున్నారో.. అదే చట్టాన్ని మఠాలకు.. వాటి ఆస్తులకు వర్తింప చేయాలన్నారు.
కొందరు దాతలు ఇచ్చిన ఆస్తుల్ని నడి బజారులో అమ్మకానికి పెడితే.. భక్తుల మనోభావాలు దెబ్బ తింటాయని.. అది ప్రభుత్వంపైనా ఆగ్రహావేశాలకు కారణమవుతుందన్నారు. దేవాలయ ఆస్తులకు ధర్మకర్తలుగా ఉండాల్సిన ప్రభుత్వం.. వాటికి తామే యజమానులుగా భావించటం సరికాదన్నారు. మఠం భూముల్ని అమ్మే విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పవన్.. ఏపీ ప్రభుత్వం మీద ఏ రీతిలో ఒత్తిడిని పెంచుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.