గెలిచే అవకాశం లేకున్నా.. గెలుపును ప్రభావితం చేయటంలో మాత్రం పవన్ కల్యాణ్ కీలకంగా మారతారన్న మాట ఏపీ రాజకీయాల్ని పరిశీలించే వారెవరైనా ఇట్టే చెప్పేస్తారు. జనసేన గెలిచి.. అధికారంలోకి రావటం సాధ్యం కాదు కానీ.. ఏపీలోని రెండు ప్రధాన పార్టీల ఓటమిలో మాత్రం కీలకభూమిక పోషిస్తుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
ఎన్నికల నోటిఫికేషన్ ముందు వరకూ తాను ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోనని చెబుతూనే.. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ప్రధాన పార్టీల్లో ఏదో ఒక దానితో పొత్తు పక్కా అన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. అయితే.. ఇలాంటి వాదనతో తమను రాజకీయంగా దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో ఉన్నట్లుగా పవన్ మండిపడుతున్నారు.
తాజాగా తమ పార్టీ పొత్తుపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఒంగోలులో జరిగిన జనసేన బహిరంగ సభలో మాట్లాడిన పవన్ మాట్లాడుతూ.. టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలతో కలిసి పోటీ చేసే ఉద్దేశం తమకు లేదని.. అసలు ఆ ప్రసక్తే రాదని స్పష్టం చేశారు. 2014లో టీడీపీ తరఫున తాను పోటీ చేశానని.. అయితే.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్ని ఆ పార్టీ అమలు చేయలేదన్నారు.
యువతకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇవ్వలేదని.. వారంతా ఉపాధి కోరుకుంటున్నట్లు చెప్పారు. తనను బ్లాక్ మొయిల్ చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు చెప్పిన పవన్ కల్యాణ్.. అలాంటి వారికి తాను భయపడనని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తాము సీపీఎంతో పొత్తు పెట్టుకోనున్నట్లు చెప్పారు. ఆ పార్టీతో కలిసి తాము పోటీ చేస్తామని చెప్పారు. పవన్ తాజా ప్రకటనతో ఆయన ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారన్న విషయంపై స్పష్టత వచ్చినట్లుగా చెప్పక తప్పదు.