ఎట్టకేలకు జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ తన క్లారిటీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టం పూర్తి కానున్న సమయంలో...నామినేషన్ల దాఖలుకు గడువు ముగుస్తున్న క్రమంలో...తాము పోటీ చేయడం లేదని వెల్లడించారు. ఇదే అంశాన్ని లౌక్యంగా ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్దేశిత కాలపరిమితిలో ఎన్నికలు జరిగినట్లయితే జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయాలన్నదానిపై ఒక ప్రణాళికను రూపొందించుకున్నాము. అయితే ఎన్నికలు ముందుగానే రావడంతో కొత్తగా ఆవిర్భవించిన జనసేనకు ఈ ఎన్నికల బరిలో నిలవడం ఒక్కింత కష్టతరంగా భావించామని జనసేన తరఫున అధికారిక ప్రకటనను వెలువరించారు. అయితే, ఈ ప్రకటన కూడా నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత వెలువడటం కొసమెరుపు.
సోమవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగిస్తున్న సంగతి తెలిసిందే.గులాబీ బాస్ ముందే 105 మంది అభ్యర్థులను ప్రకటించేసి అనంతరం పలు దఫాల్లో మిగతా సీట్లకు పోటీ పడే వారిని ఖరారు చేశారు. అదే ఊపులో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ మహాకూటమి రూపంలో కాంగ్రెస్ 94 - తెలంగాణ జనసమితి 8 - టీ.టీడీపీ 14 - సీపీఐ 3 స్థానాల్లో పోటీ చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించి బరిలో దిగేందుకు సిద్ధమైంది. వామపక్ష పార్టీల్లో ఒకటైన సీపీఎం బీఎల్ పీ పేరుతో బరిలో దిగింది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, పార్టీ దృష్టి మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల మీదే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.ఇలా అన్ని ప్రధాన పార్టీలు తమ వైఖరిని వెల్లడించిన సమయంలో అందరి చూపు జనసేనపై పడింది. జనసేన పార్టీ మాత్రం తమ వైఖరిని వెల్లడించకలేకపోతోందని, ఇంకా నాన్చివేత దోరణిని అవలంభిస్తోందని జనసేన వర్గాల్లోనూ చర్చ జరిగింది.
అయితే, తాజాగా జనసేన క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ ప్రజల పక్షాన నిలవడమే జనసేన లక్ష్యమని పేర్కొంటూ తాము పోటీ చేయడం లేదని పేర్కొంది. ``తెలంగాణ ఎన్నికలపై పార్టీలోని నాయకుల సమావేశం జరిగింది.శాసనసభ ఎన్నికలకు కాకుండా షెడ్యూల్ ప్రకారం జరగనున్న రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది. పార్లమెంట్ ఎన్నికల కోసం జనసేన ఇప్పటి నుంచే సమాయత్తం అవుతుందని తెలంగాణ ప్రజలకు వినయపూర్వకంగా తెలియచేస్తున్నాను. ``తెలంగాణ రాష్ట్రంలో నిర్దేశిత కాలపరిమితిలో ఎన్నికలు జరిగినట్లయితే జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయాలన్నదానిపై ఒక ప్రణాళికను రూపొందించుకున్నాము.అయితే ఎన్నికలు ముందుగానే రావడంతో కొత్తగా ఆవిర్భవించిన జనసేనకు ఈ ఎన్నికల బరిలో నిలవడం ఒక్కింత కష్టతరంగా భావించాము`` అని తమ వైఖరిని ప్రకటించారు.