సీఎం పోస్ట్ పై మ‌ళ్లీ క్లారిటీ ఇచ్చేసిన ప‌వ‌న్‌

Update: 2017-12-10 04:25 GMT
నాలుగు రోజుల పాటు సాగిన ప‌వ‌న్ ఏపీ ప‌ర్య‌ట‌న ముగిసింది. ఈ నాలుగు రోజుల్లోనూ పార్టీ ఔత్సాహికుల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎన్నో ఆస‌క్తిక‌ర అంశాల్ని వెల్ల‌డించారు. ప‌వ‌న్ మాట్లాడ‌టం మొద‌లు కాగానే సీఎం.. సీఎం అంటూ ఆయ‌న పార్టీ ఔత్సాహికులు అరుపులు అర‌వ‌టం.. నినాదాలు చేశారు.

ఈ నినాదాలపై ప‌వ‌న్ పాల్గొన్న ప్ర‌తిస‌భ‌లోనూ క్లారిటీ ఇచ్చారు.తొలుత విశాఖ‌ప‌ట్నంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంతో మొద‌లైన ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న ప్ర‌కాశం జిల్లా ఒంగోలులో ముగిసింది. విశాఖ‌లో హాజ‌రైన స‌భ‌లో సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేయ‌టంపై కాస్తంత అస‌హ‌నంతో స్పందించారు.

సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేయ‌టం స‌రికాద‌న్నారు. అన్ని పార్టీలు అలానే చేస్తాయ‌ని.. మ‌నం కూడా అలా చేస్తే ఏం బాగుంటుంద‌ని ప్ర‌శ్నించ‌ట‌మే కాదు.. బాధ్య‌త‌గా ఉండాలంటూ సూచ‌న‌లు చేశారు. త‌ర్వాత పాల్గొన్న స‌భ‌ల్లోనూ సీఎం.. సీఎం అంటూ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఒక‌ద‌శ‌లో విసుగును ప్ర‌ద‌ర్శించారు.

తన‌ను సీఎం అన్నంత మాత్రాన తాను కాను క‌దా అంటూ అభిమానుల ఉత్సాహానికి బ్రేకులు వేస్తూ.. తాను చెప్పేది వినాల‌ని కోరారు. తాజాగా మాత్రం త‌న విసుగు.. అస‌హ‌నాన్ని ప‌క్క‌న పెట్టిన ప‌వ‌న్‌.. త‌న ప్ర‌సంగాన్ని ఆపి.. న‌వ్వుతూ బ‌దులిచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

మీరు సీఎం అన్నా.. నేను కాను. నాకు ఇష్టం ఉండ‌దు. ఎందుకంటే సీఎం ప‌ద‌వి అంటే చాలా క‌ష్ట‌మైన ప‌ని. బాధ్య‌తతో కూడుకున్న‌ది. ఈ ప‌ద‌విని చేప‌ట్టేందుకు అనుభ‌వం కావాలి. నేను చాలా ప్రాక్టిక‌ల్ గా ఉంటా. బాధ్య‌త‌గా ఉంటా. అధికారం లేకున్నా ఫ‌ర్లేదు.. న‌మ్మ‌కాన్ని మాత్రం పోగొట్టుకోను అంటూ క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. మొత్తానికి సీఎం.. సీఎం అంటూ అభిమానులు.. ఔత్సాహికులు చేసే నినాదాల‌కు పుల్‌ స్టాప్ ప‌డేలా ప‌వ‌న్ స‌మాధానం చెప్పార‌ని చెప్పాలి. అయితే.. ఆయ‌న మాట‌లు వారి మీద ప్ర‌భావం చూపించ‌లేదు స‌రిక‌దా.. సీఎం.. సీఎం అన్న మాట‌ను కంటిన్యూ చేయ‌టం క‌నిపించటం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News