బీజేపీ నేతలకు పవన్ ఎంత సాయం చేశారంటే..

Update: 2016-09-11 05:26 GMT
తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తున్న జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఏపీ బీజేపీనేతలు థ్యాంక్స్ చెబుతున్నారా? ఆయన్ను అమితంగా ఆరాధిస్తున్నారా? అంటే అవుననే చెప్పాలి. కాకుంటే.. ఈవిషయాలేవీ వారు బయటకు చెప్పుకోవటం లేదు. కానీ.. లోలోపల మాత్రం పడుతున్న సంతృప్తి అంతా ఇంతా కాదనే మాట సర్వత్రావినిపిస్తోంది. ఎందుకలా? అంటారా? అక్కడికే వస్తున్నాం.

తిరుగులేని మెజార్టీని సాధించిన బీజేపీ అధినాయకత్వం కానీ.. ప్రధానిమోడీ కానీ ఏపీ బీజేపీ నేతలకు ఇచ్చే విలువ.. మర్యాద ఎంతటివో ప్రత్యకించి చెప్పాల్సిన అవసరమే లేదు. గడిచిన రెండు సంవత్సరాల మూడు నెలల్లో ఏపీ బీజేపీ నేతల్ని ప్రధాని మోడీ ఎన్నిసార్లు భేటీఅయ్యారు? ఏపీ సమస్యల గురించి ఎన్నిసార్లు మాట్లాడారు? లాంటి ప్రశ్నలు వేసుకుంటే సమాధానం ఇట్టే అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే.. ఏపీ బీజేపీ నేతల్ని చూడని కూడా చూడని మోడీ.. అమిత్ షా లకు ఒక్కసారి ఏపీ కమలనాథులు గుర్తుకు వచ్చారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. హోదా మీద ఆయన మొదలెట్టిన పోరు బీజేపీ అధినాయకత్వం ఉలిక్కిపడింది. ఒక్కసారిగా అలెర్ట్ అయ్యింది. ఎప్పుడూ ఢిల్లీకి పిలిచి.. మాట్లాడని తీరుకు భిన్నంగాఏపీ కమలనాథులు దేశ రాజధానికి రావాలని చెప్పటమే కాదు.. మోడీలాంటి నేత వారితో కూర్చొని మాట్లాడటం గమనార్హం. తమకు తాముగా ఇలాంటి అవకాశాన్ని ఏపీ బీజేపీ నేతలు దక్కించుకున్నారా? అంటే అసలు విషయం అందరికి తెలిసిందే.

ఏపీలో బీజేపీపై పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ అన్నట్లుగా ప్రధానితోభేటీ ఏర్పాటు చేయించి.. పార్టీ నేతలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారుఅమిత్ షా అండ్ కో. ఇంతకాలం కనీసం లెక్కలోకి తీసుకోని ఏపీ బీజేపీనేతల్ని సాదరంగా ఆహ్వానించి.. మోడీతో మాట్లాడించే అవకాశంకల్పించిన పవన్ కల్యాణ్ కు ఏపీ బీజేపీ నేతలు థ్యాంక్స్ చెప్పుకోకుండాఉండగలరా..?
Tags:    

Similar News