పవన్ ‘సెల్ఫ్’ గోల్..చిరంజీవి ప్రస్తావనతో డ్యామేజ్

Update: 2017-12-07 04:33 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొంత గ్యాప్ తరువాత మళ్లీ ప్రజల్లోకి రావడంతో భారీ రెస్పాన్సు వచ్చింది. అయితే, ఆయన తన ప్రసంగంలో ఆయన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ గురించి ప్రస్తావించడంతో ఆయన రాజకీయాల్లోకి ఎందుకొచ్చారన్న విషయంలో ఇతర పార్టీల నేతలు కొత్త అనుమానాలు లేవెనెత్తుతున్నారు. ముఖ్యంగా ఆయన... తన అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీకి - చిరంజీవికి మోసం చేసినవారికి బుద్ది చెబుతానని అనడం పవన్ రాజకీయ లక్ష్యాలపై అనుమానాలను పెంచుతోంది. ప్రజల తరఫున ప్రశ్నించడానికి వచ్చానన్న పవన్ నిజంగా అందుకే వచ్చాడా లేదంటే.. సీఎం కావాలని కలలు కన్న తన అన్న చిరంజీవి కేవలం కేంద్ర మంత్రి పదవిని అనుభవించి ఇప్పుడు క్రియాశీల రాజకీయాల నుంచి తెరమరుగు కావడం వరకు జరిగిన పరిణాల నేపథ్యంలో ఏ దశలోనైనా ఆటంకంగా నిలిచారని భావించిన వ్యక్తులు - వర్గాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాడా అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
    
పవన్ వ్యాఖ్యలు అందుకు ఊతమిస్తున్నాయి... రాజకీయాల్లో మార్పు తెస్తూ - ప్రజలకు మంచి చేయాలని అనుకున్న తన అన్న స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ఎంతో మంది ద్రోహం చేశారని - వాళ్లను కొట్టినా - తిట్టినా సరిపోదని పవన్ కల్యాణ్ అనడం తెలిసిందే. ‘‘వాళ్లను ఏం చేయాలో అది చేసి - చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెబుతా.. పీఆర్పీని ఎవరెవరు దెబ్బతీశారన్న విషయాన్ని తాను ఏ క్షణం కూడా మరచిపోను, వారి పేర్లన్నీ నా గుండెల్లో ఉన్నాయి’’ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.
    
పవన్ రాజకీయ ప్రవేశం - జనసేన పార్టీ స్థాపన వెనుక హిడెన్ అజెండా ఉందన్న చర్చ మొదలైంది. దీంతో ఇంతవరకు అప్పుడప్పుడు బయటకొచ్చి హడావుడి చేసినా సరే తనకున్న క్రేజ్ కారణంగా ప్రభావం చూపిస్తున్న పవన్ విషయంలో తటస్థ వర్గాలు - అనుకూల వర్గాల్లోనూ అనుమానాలు మొదలవుతున్నాయి.  అంతేకాదు... రాజకీయాల్లోకి వచ్చి ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసుకున్న చిరంజీవిని భుజానికెత్తుకుని పవన్ కూడా పెద్ద పొరపాటు చేశారని - అది పవన్ ఇమేజినీ డ్యామేజ్ చేసిందని అంటున్నారు.
    
అంతేకాదు... సినీహీరోగా పవన్ కు ఉన్న క్రేజ్ - రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు - ఓట్ల చీలికలు - సామాజిక సమీకరణలు అన్నీ కలిసొచ్చి ఒకవేళ పవనే కనుక అధికారం దక్కించుకుంటే రాజకీయ ప్రతీకారాలు - కక్ష సాధింపులు ఉంటాయని... పవన్ మాటల్లో అది స్పష్టంగా బయటపడిందని అంటున్నారు. ఏదేమైనా పవన్ ఇంతవరకు తనకున్న పొలిటికల్ ఇమేజ్ ను ఒక్క మాటతో డ్యామేజి చేసుకున్నట్లయిందని ఆయన అభిమానులు కూడా అంటున్నారు.
Tags:    

Similar News