వైసీపీలోని కాపు ఎమ్మెల్యేలకు పవన్ వార్నింగ్!

Update: 2022-10-18 10:31 GMT
రాష్ట్రంలో అణగారిన వర్గాలు, వెనుకబడిన కులాలకు కూడా పరిపాలించే అవకాశం రావాలని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రాన్ని రెండే కులాలు పరిపాలిస్తున్నాయన్నారు. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని కోరారు. ఒకే కులం మద్దతుతో ఏ పార్టీ అధికారంలోకి రాదన్నారు.

పల్నాడులో బ్రహ్మనాయుడు కన్నమనీడు అనే వ్యక్తిని సర్వ సైన్యాధ్యక్షుడిని చేశారని చెప్పారు. అలాగే బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన మరో వ్యక్తిని కూడా బ్రహ్మనాయుడు సైన్యాధిపతిని చేశారన్నారు. అన్ని కులాలను కలుపుకుని ఆయన యుద్ధం చేశారన్నారు. అందరూ సమానమే అని చాటి చెప్పడానికి చాపకూడును ప్రవేశపెట్టారని కొనియాడారు.

వైసీపీకి ఊడిగం చేస్తున్న నేతలు ఊడిగం చేసుకోవాలని.. అయితే కులాన్ని మాత్రం లోకువ చేయొద్దని పరోక్షంగా పేర్ని నాని, అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజా, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్‌లకు పవన్‌ హితవు పలికారు. గతంలో కాపులపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ప్రతి అడ్డమైనవాడికి కులాన్ని దూషించడం ఫ్యాషనైందంటూ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా సైతం పేర్ని పేరు ఎత్తకుండా ఆ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

ఇప్పుడు మరోసారి పవన్‌ కల్యాణ్‌ సైతం కులాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి కులానికి సంఘం ఉందని.. కమ్మ కంఘం, కాపు సంఘం, వెలమ సంఘం, యాదవ సంఘం, గౌడ సంఘం, బ్రాహ్మణ సంఘం ఉన్నాయన్నారు. అందరూ కలిస్తేనే విజయం సాధించగలమన్నారు.

కాపు, తెలగ, ఒంటరి, బలిజ సమూహాలు అధికారం కావాలని కోరుకుంటాయని.. అయితే అధికారం కోసం మీరు ఏం చేశారని పవన్‌ కల్యాణ్‌ నిలదీశారు. వంగవీటి రంగా గారు సభ పెడితే పది లక్షల మంది జనంతో కృష్ణా తీరం నిండిపోయిందని గుర్తు చేశారు. అయితే ఆయనను హత్య చేసినప్పుడు ఆయన పక్కన మీరెందుకు లేరని నిలదీశారు. గ్రామానికి పది మంది చొప్పున వెళ్లి ఆయన పక్కన నుంచున్నా ఆయన మరణించేవారు కాదని చెప్పారు. ఆయన హత్యకు మీరు కూడా కారణమయ్యారని కాపులను ఉద్దేశించి అన్నారు.

అలాగే బంతి కొట్టు సన్నాసి (అవంతి శ్రీనివాసరావు, కొట్టు సత్యనారాయణ, పేర్ని నాని) అని ముగ్గురు కాపులు ఉన్నారని వారిపై పవన్‌ మండిపడ్డారు. కాపు నా డ్యాష్‌ అంటూ తిడతారని నిప్పులు చెరిగారు. తిడితే నన్ను తిట్టుకో.. అంతేకానీ కాపులను ఏమన్నాంటే నాలుకో చీరేస్తారా సన్నాసి అంటూ పేర్ని నానిపై పరోక్షంగా పవన్‌ కల్యాణ్‌ ఆయన పేరెత్తకుండా మండిపడ్డారు. నీతో బూతులు తిట్టించే పెద్ద మనిషి కాళ్లు ఒత్తాలని కులాన్ని మాత్రం ఏమన్నా అంటే నీ నాలుక చీరేస్తానని ధ్వజమెత్తారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News