ఉపాధ్యాయులకు మద్దతుగా పవన్ కళ్యాణ్.. నెక్ట్స్ ఏంటీ?

Update: 2022-02-07 16:30 GMT
ఉద్యోగులు మెత్తబడ్డారు. సమ్మె విరమించారు. కానీ ఉపాధ్యాయులు మాత్రం వెనక్కి తగ్గలేదు. పీఆర్సీ సాధన సమితితో విభేదిస్తున్న ఉపాధ్యాయ సంఘాలకు జనసేన మద్దతుగా నిలబడడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతభత్యాల వివాదాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటూ మండిపడ్డారు. పీఆర్సీలో 27 శాతం ఫిట్ మెంట్ సాధించడంలో పీఆర్సీ సాధన సమితి నేతలు విఫలమైనట్టు పవన్ ప్రకటించారు.

ఇక సమ్మె విషయంలో ఉద్యోగులు చిత్తశుద్ధి చూపలేదని.. ఉద్యోగ సంఘాల ఆధిపత్య ధోరణిపై పవన్ మండిపడుతున్నారు. ఏ ప్రభుత్వమైనా తనదే పైచేయి కావాలని ప్రయత్నిస్తుంది. సమస్య ఏదైనా ఉద్యోగ సంఘాలు చెప్పినట్లు నడుచుకోవడానికి ప్రభుత్వం ఒప్పుకోదు. అంతిమంగా పైచేయిగా ఉండాలని ప్రభుత్వం అనుకోవడంలో తప్పేమీ లేదు. నిర్ణయాలు సరిగ్గా ఉన్నప్పుడు ఫర్వాలేదు కానీ.. తమదే నెగ్గాలని ప్రభుత్వం అనుకుంటే అది జరిగే పని కాదు.

ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం టార్గెట్ చేసి వారితోనే ధన్యవాదాలు చెప్పించుకోవడం బాగాలేదంటూ పవన్ కళ్యాణ్ ఆక్రోశించారు. ఉద్యోగ సంఘాల నేతలతో విభేదిస్తున్న ఉపాధ్యాయ సంఘాల వ్యాఖ్యలను పవన్ ప్రస్తావించడం గమనార్హం. జనసేన ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లకు మద్దతుగా నిలబడుతోందన్నట్లుగా సంకేతాలు పంపారు.

ఇక ఉద్యోగ , ఉపాధ్యాయ సంఘాలు ఎప్పుడూ పిలిచినా ఆందోళనల్లో పాల్గొనేందుకు తాము సిద్ధంగా ఉంటామని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చూస్తే ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలకు డైరెక్టుగానే జనసేన మద్దతు ప్రకటించింది.

ఈ పవన్ ప్రకటన చూసిన తర్వాత ఉపాధ్యాయ సంఘాలు, కాంట్రాక్టు ఉద్యోగులు చేసే ఆందోళనల్లో జనసేన కార్యకర్తలు కూడా పాల్గొంటారు.
Tags:    

Similar News