ఎన్నికల రాజకీయం బహు చిత్రం. అధికారం అందుకోవడం ఇంకా విచిత్రం. మ్యాజిక్ ఫిగర్ కి దరిదాపుల్లోకి వచ్చి మెజారిటీ రాని పార్టీల ను చిన్న పార్టీలే ఆటాడిస్తాయి.ఇది భారతదేశం లో చాలా సార్లు జరిగింది. తెలుగుదేశం విషయం తీసుకుంటే ఏపీ లో పెద్ద పార్టీయే. కానీ పొత్తుల కోసం చూస్తోంది. ఒంటరి పోరు కు వెనకంజ వేస్తోంది. సరిగ్గా ఈ వీక్ నెస్ నే పట్టుకుని తమ పాలిటిక్స్ ని పదును పెట్టడానికి జనసేన చూస్తోందా అంటే అవును అనే జవాబు వస్తోంది.
జనసేన కు 2024 ఎన్నికల్లో రెడీమేడ్ గా పవర్ వచ్చినా రాకపోయినా బేఫికర్. అదే టీడీపీ కి మాత్రం ఈ ఎన్నికలు ప్రాణప్రదం. అందుకే సరైన టైం చూసి మరీ పవన్ కళ్యాణ్ టీడీపీ ని తగ్గాల్సిందే అని హెచ్చరిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. వారాహి రధమెక్కి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల లో పర్యటిస్తున్న పవన్ స్వరంలో మార్పు వచ్చింది.
ఇంతకాలం వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని ఒకటే మాటగా చెప్పిన పవన్ ఈసారి మాత్రం ఆ మాట ను కాస్తా పక్కన పెట్టారు. వైసీపీ మీద అదే వేడి వాడి విమర్శలు కొనసాగుతున్నాయి. కానీ టీడీపీ బీజేపీల గురించి ఏమీ మాట్లాడడంలేదు. ఇక తెలుగుదేశం విషయమే తలవడం లేదు. తనను ఒక్క చాన్స్ ఇవ్వాలని పవన్ అడగడం బట్టి వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందా అన్న డౌట్లు మొదలవుతున్నాయి.
ఏపీ లో టీడీపీ ఇటీవల కాలంలో జోరు చూపిస్తొంది. లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. చంద్రబాబు జిల్లాల టూర్లు పెట్టుకుంటున్నారు. రాజమండ్రీలో రెండు రోజుల మహానాడుని సక్సెస్ ఫుల్ గా టీడీపీ నిర్వహించింది. ఆ మహానాడు లో మినీ మ్యానిఫేస్టోని రిలీజ్ చేసింది తెలుగుదేశం. రేపటి ఎన్నికల్లో మిత్రుల తో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్న టీడీపీ సొంతంగా మ్యానిఫేస్టోని రిలీజ్ చేయడం పట్ల పవన్ గుర్రుగా ఉన్నారని అంటున్నారు.
అందుకే మ్యానిఫేస్టో మీద ఆయన ఒక్క మాట కూడా ఇప్పటిదాకా మాట్లాడలేదని అంటున్నారు. మరో వైపు చూస్తే తెలుగుదేశం పార్టీతో పొత్తులు ఉంటాయని ఈ మధ్య దాకా సంకేతాలు ఇస్తూ వచ్చిన పవన్ ఇపుడు టోన్ మార్చి విడిగా వస్తానో ఉమ్మడిగా వస్తానో అన్న సస్పెన్స్ ఉంచారు. ఇది కచ్చితంగా టీడీపీ మీద చేసే వత్తిడి రాజకీయమే అని అని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులు ఆషామాషీ కాదని వారాహి రధ యాత్ర తో తెలిసిపోతోంది. తనకు గౌరవప్రదమైన సీట్లు కావాలని మొదటి నుంచి పవన్ ఏమీ దాచుకోకుండానే పబ్లిక్ మీటింగ్స్ లోనే చెబుతూ వస్తున్నారు. గౌరవప్రదమైన సీట్లు అంటే కచ్చితంగా యాభై నుంచి అరవై సీట్లు అన్నది జనసేన వర్గాలలో వినిపిస్తున్న టాక్.
అయితే ఏ పాతిక దాకానో సీట్లను ఇచ్చి పొత్తు కధను సుఖాంతం చేసుకోవాలని టీడీపీ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సరిగ్గా ఇక్కడే పీటముడి పడింది అని అంటున్నారు.అందుకే పవన్ తనకు ఒక్క చాన్స్ అని జనాల వద్దకు వచ్చి విన్నపం చేస్తున్నారు అని అంటున్నారు. తాము కోరుకున్న మేరకు సీట్లు ఇవ్వకపోతే విడిగానే అన్న సందేశం లాంటి హెచ్చరిక కూడా ఇందులో ఉంది అని అంటున్నారు.
జనం లో తన పట్టుని నిరూపించుకోవడం ద్వారా తెలుగుదేశాని కి జనసేన బలం ఏంటో చూపించి సీట్ల కోసం పట్టుబట్టాలని ఆయన చూస్తున్నారు అని అంటున్నారు. వైసీపీ ని గద్దె దించాలన్నది అజెండా అయినప్పటికీ టీడీపీకి తగ్గి ఉండాల్సిన అవసరం అయితే జనసేన కు లేదని పవన్ భావిస్తున్నారు అని అంటున్నారు.
తమది ఒక రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయ అవసరాల మేరకే పొత్తులు ఉంటాయని అవి కూడా జనసేన కు లాభకరంగా ఉండాల్సిందే అన్నదే పవన్ ఆలోచనగా చెబుతున్నారు. పొత్తుల పేరుతో తెలుగుదేశం పార్టీ జనసేన ని లైట్ తీసుకుంటే ఊరుకునేది లేదని చెప్పడం కూడా పవన్ ఆలోచనగా పేర్కొంటున్నారు.
ఏ విధంగా చూసినా జనసేన అవసరం టీడీపీ కి ఎక్కువగా ఉంటుందని అలాంటపుడు ఆ పార్టీతో తగ్గి వెళ్లాల్సిన అగత్యం లేదని, తమ వాటా తమ బలానికి తగినట్లుగా దక్కాల్సిందే అన్నది పవన్ ఆలోచనగా తెలుస్తోంది. మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్ వారాహి రధ యాత్రతో అటు వైసీపీకి టార్గెట్ చేస్తూనే ఇటు టీడీపీకి అలెర్ట్ చేస్తున్నారు. జనసేన కూడా బలమైన పార్టీయే అని చెప్పకనే చెబుతున్నారు. జూనియర్ పార్టనర్ గా ఉండేందుకు ఇష్టపడమని కూడా స్పష్టం చేస్తున్నారు. మరి తేల్చుకోవాల్సింది టీడీపీ యేనా. వారాహి రధ యాత్ర పూర్తి అయితేనే తప్ప టీడీపీ జనసేన పాలిటిక్స్ లో క్లారిటీ వచ్చే అవకాశం లేదు అంటున్నారు.