జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకున్న మాటను నిలుపుకొన్నారు. అనంతపురం వాసుల విషయంలో...పవన్ తన మాటకు కట్టుబడ్డారు. అనంతపురం జిల్లాలో జనసేన కార్యాలయానికి త్వరలో శంకుస్థాపన జరుగనుంది. ఈ విషయాన్ని స్వయంగా పవన్ ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించారు. గుత్తిరోడ్డులో రెండెకరాల స్థలంలో జనసేన కార్యాలయం నిర్మించనున్నారు.ఈ వివరాలను తాజాగా పవన్ కళ్యాణ్ పేరుతో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో జనసేన తెలిపింది.
గత ఏడాది అనంతపురం జిల్లాలో పర్యటించిన సందర్భంగా తన కేంద్రాన్ని అనంతపురంలోనే ఏర్పాటు చేస్తానని పవన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా...తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యాలయాన్ని విజ్ఞాన కేంద్రంగా, మేధావుల చర్చలకు తీర్చిదిద్దుతామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.
కాగా, గత ఏడాది పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేస్తానంటూ పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేస్తానని పవన్ స్వయంగా ప్రకటించడంతో ఒక్కసారిగా అనంతపురం జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. దీనికి కొసాగింపుగా అనంతలో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు జనసేన రంగం సిద్ధం చేస్తోందని తెలుస్తోంది.
మరోవైపు అనంత అర్బన్‌లో ఆయన సామాజిక వర్గం బలంగా ఉండడంతోనే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే చర్చలు సాగుతున్నాయి. అనంతపురం జిల్లాలో నెలకొన్న సమస్యలపై పవన్ కల్యాణ్ ఇప్పటికే తన వాణి వినిపించారు. ఈ నేపథ్యంలో పవన్ ఎంట్రీతో ఆ ప్రభావం రాయలసీమ మొత్తం మీద ఉండే అవకాశాలున్నాయని ఆయన అభిమానులు అంటున్నారు. పవన్ పోటీతో టీడీపీ కంచుకోటకు బీటలు వారుతాయని పవన్ ఫ్యాన్స్ చెబుతున్నారు.