ముంద‌స్తు సిగ్నిల్స్ ప‌వ‌న్‌ కు ముందే అందాయా?

Update: 2018-01-31 05:59 GMT
పార్టీ పెట్టి ఏళ్లు దాటుతున్నా.. నెల‌కోసారి కూడా రాజ‌కీయ అంశాల మీద దృష్టి పెట్ట‌ని రాజ‌కీయ పార్టీ ఏదైనా ఉందంటే అది ప‌వ‌న్ క‌ల్యాణ్ కు చెందిన జ‌న‌సేన పార్టీనేన‌ని చెప్పాలి. ఈ రోజుకి ఆ పార్టీ అన్న వెంట‌నే ప‌వ‌న్ మాత్ర‌మే గుర్తుకు వ‌స్తారు. మిగిలిన వారెవ‌రూ రిజిష్ట‌ర్ కారు. ఆయ‌న చుట్టూ ఉన్న కొంద‌రు.. స‌న్నిహితుల‌తోపార్టీ ప‌నులు చేయించుకునే ప‌వ‌న్‌.. ఏ నేత‌నూ ఇప్ప‌టివ‌ర‌కూ త‌న పార్టీలోకి ఆహ్వానించ‌టం క‌నిపించ‌దు.

ఎందుకంటే.. టాప్ టు బాట‌మ్ పార్టీలో తాను మాత్ర‌మే ఉండాల‌న్న జాగ్ర‌త్త‌తో పాటు.. నేత‌ల్ని చేర్చుకోవ‌టం ద్వారా కొత్త త‌ల‌నొప్పులు ఎదుర్కోవాల్సిన ఇబ్బంది ఉండ‌టంతో.. వారిని వీలైనంత దూరంగా ఉంచాల‌ని ప‌వ‌న్ భావిస్తున్న‌ట్లుగా చెబుతారు. దీంతో.. పార్టీలో చేరేందుకు ఆస‌క్తి చూపించిన కొంద‌రు నేత‌ల్ని ప‌వ‌న్ వారిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

అలా అని త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన వారిని నిరాశ ప‌ర్చ‌కుండా.. త్వ‌ర‌లోనే పార్టీ యాక్టివ్ అవుతుంద‌ని.. అప్పుడు వారి సాయాన్ని తీసుకోనున్న‌ట్లుగా స‌ముదాయించి పంపుతున్న‌ట్లు చెబుతున్నారు.

పాలిటిక్స్ ను యాక్టివ్ గా తీసుకోని ప‌వ‌న్‌.. ఉన్న‌ట్లుండి పార్టీ నిర్మాణం మీద దృష్టి సారించ‌టం.. వ‌రుస‌గా తెలంగాణ‌.. ఏపీల‌లో ప‌ర్య‌ట‌న‌లు చేయ‌టం వెనుక భారీ వ్యూహం ఉంద‌ని చెబుతున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్ని వీలైనంత త్వ‌ర‌గా నిర్వ‌హించాల‌న్న ఆలోచ‌న‌లో మోడీ ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. దీనికి భిన్నంగా ఇద్ద‌రు చంద్రుళ్లు ఎన్నిక‌ల విష‌యంలో ఉన్న‌ట్లు చెప్పినా.. సీట్ల పెంపు విష‌యంలో కేంద్రం త‌మ డిమాండ్ల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తే.. ముంద‌స్తుకు అయినా జ‌మిలికి అయినా త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని తేల్చి చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ విష‌యాల‌పై అవ‌గాహ‌న ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అంద‌రికంటే ముందే మేల్కొన్న‌ట్లుగా చెబుతున్నారు. వాస్త‌వానికి ఎవ‌రికి ఎలాంటి సందేహం క‌ల‌గ‌ని రీతిలో రాజ‌కీయాల‌పై త‌న‌కున్న ఆస‌క్తి కంటే ప్రజా స‌మ‌స్య‌ల ప‌ట్ల త‌న‌కున్న అతృత‌ను ప్ర‌ద‌ర్శించే రీతిలో ప‌ర్య‌ట‌న‌లు ఉండాల‌న్నట్లుగా భావించిన‌ట్లు చెబుతారు. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాల్లో త‌న టూర్ల‌ను సిద్ధం చేసుకున్నారు.

మిగిలిన రాజ‌కీయ పార్టీలు.. అధినేత‌ల కంటే ముందు.. ప్ర‌జ‌ల్లో తిర‌గ‌టం.. ఒకే అంశాన్ని అదే ప‌నిగా చెప్ప‌టం ద్వారా ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం తాను త‌పిస్తున్న వైనాన్ని అంద‌రికి తెలిసేలా చేయాల‌న్న‌ది ప‌వ‌న్ ప్లాన్ గా చెబుతున్నారు. ఇందుకు త‌గ్గ‌ట్లే ఇప్ప‌టికే ప‌లు జిల్లాల్ని క‌వ‌ర్ చేసిన ఆయ‌న‌.. ఇప్ప‌టి నుంచి ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కూ వెన‌క‌డుగు వేసే అవ‌కాశ‌మే లేద‌ని చెబుతున్నారు. ముంద‌స్తుకు సంబంధించి స్ప‌ష్ట‌మైన స‌మాచారం అంద‌రి కంటే ముందు ప‌వ‌న్‌ కు చేరిన‌ట్లుగా తెలుస్తోంది. పైకి అంద‌రిని ప్ర‌శ్నిస్తాన‌ని చెబుతూనే.. అంత‌ర్లీనంగా త‌న‌కు న‌చ్చిన వారిని వెన‌కేసుకొస్తున్న‌ట్లుగా మాట్లాడుతున్న ప‌వ‌న్ వైఖ‌రి చూస్తే.. ఎన్నిక‌ల విష‌యంలో ఆయ‌న‌కు ప్ర‌త్యేక‌మైన ఎజెండా ఉంద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

Tags:    

Similar News