ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌ర్నూలు టూర్.. ఆ కౌంట‌ర్ల‌ కు స‌మాధానాలేవి?

Update: 2020-02-13 12:30 GMT
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చేప‌ట్టిన క‌ర్నూలు టూర్ తో ఏదో రాజ‌కీయం చేసే ప్ర‌య‌త్నం చేశారు. గిరిజ‌న బాలిక‌ పై జ‌రిగిన అత్యాచారం మీద ప‌వ‌న్ అక్క‌డ‌కు వెళ్లారు. ప‌వ‌న్  క‌ల్యాణ్ త‌న స్టైల్లో ఈ సారి వీరావేశంతో రెచ్చి పోలేదు కానీ, ఏవో హెచ్చ‌రిక‌లు చేశారు. అయితే ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన పాయింట్లు కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్య‌మైన‌ది నిందితుల పేర్ల‌ను ప‌వ‌న్ ఎక్క‌డా ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం!

ఆ బాలిక‌పై అత్యాచారం జ‌రిగింది ఇప్పుడు కాదు. 2017లోన‌ట‌. ఆ స‌మ‌యంలోనే నిందితుల పేర్లు కొన్ని వార్త‌ల్లోకి వ‌చ్చాయి. నిందితులు తెలుగుదేశం పార్టీ నేత‌ల‌నే అభిప్రాయాలు కూడా అప్ప‌ట్లోనే వినిపించాయి. వారు తెలుగుదేశం నేత‌లు, అప్ప‌టి అధికార పార్టీ వాళ్లు కావ‌డంతోనే... వాళ్ల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌లేద‌ని, వారి అరెస్టు అప్ప‌ట్లో జ‌ర‌గ‌క‌పోవ‌డానికి కార‌ణం వారు తెలుగుదేశం నేత‌లు కావ‌డ‌మే అనే అభిప్రాయాలు వినిపించాయి.

అయితే అప్ప‌ట్లో ఈ అంశం గురించి మాట్లాడ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు స్పందించారు. వార్నింగులు ఇచ్చారు. అయితే నిందితుల మాట‌ను మాత్రం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎత్త‌లేదు! త‌మ కూతురుపై ఎవ‌రు అఘాయిత్యానికి పాల్ప‌డ్డార‌నే అంశంపై బాధితురాలి త‌ల్లి  కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ మేర‌కు ఇది వ‌ర‌కే కొంద‌రి మీద ఆరోప‌ణ‌లు చేశారు. వారి మీద చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఫిర్యాదులు చేశారు. అయితే అలా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నిందితుల ప్ర‌స్తావ‌న మాత్రం ప‌వ‌న్ క‌ల్యాణ్ తీసుకు రాలేదు!

సాధార‌ణంగా అత్యాచారం కేసుల్లో బాధితురాలి పేరు ప్ర‌స్తావించ‌కూడ‌దు. చ‌ట్ట ప్ర‌కారం కూడా బాధితురాలి పేరును ప్ర‌స్తావించ‌కూడ‌దు. మీడియాకు కూడా ఆ నిబంధ‌నలు వ‌ర్తిస్తాయి. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం ప‌దే ప‌దే బాధితురాలి పేరును ప్ర‌స్తావించారు. బాధితురాలి పేరును ప్ర‌స్తావించ‌డానికి వెనుకాడ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ , నిందితుల ఊసు మాత్రం ఎత్త‌లేదు. వారు తెలుగుదేశం వార‌నే మాట‌నూ ప్ర‌స్తావించ‌లేదు. దీని కార‌ణం ఏమిటో ప‌వ‌న్ కే తెలియాలి!
Tags:    

Similar News