తెలుగు ప్రజల చరిత్రలో కీలక పరిణామంగా నిలిచిన రాష్ట్ర విభజన పోరాటాన్ని స్పూర్తిగా తీసుకొని...జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆలోచన మరో ముందడుగు వేసింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో జేఏసీ ఎంతగానో దోహదపడిందని, అందుకే తాను కూడా జేఏసీ ఏర్పాటు చేసి విభజన హామీలను సాధించేందుకు మార్గం ఎంచుకున్నట్టు పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. అనంతరం దాన్ని జేఎఫ్‌సీగా మార్చారు! విభజన సమయంలో కేంద్రం ఎలాంటి హామీలిచ్చింది ? ఎంతవరకు హామీలు అమలయ్యాయి ? ఇంకా ఎలాంటి హామీలు అమలు కావాల్సి ఉంది ? నిధులు ఎన్ని వచ్చాయి ? ఎంత ఖర్చయ్యాయి ? ఇతరత్రా అంశాలపై కమిటీ వేసిన పవన్ ఇందులో లోక్ సత్తా అధినేత జేపీ, రాజకీయ వేత్త ఉండవల్లితో పాటు ఇతర మేధావులు, నిపుణులుంటారని తెలిపారు. ఈ మేరకు వారిద్దరితో భేటీ కూడా అయ్యారు.
దీనికి కొనసాగింపుగా..తాజాగా జేఎఫ్ సీ లోగో విడుదల చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్లో లోగోను పోస్ట్ చేశారు. కాగా, పవన్ జేఎఫ్‌సీపై అప్పుడే రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. పవన్ ప్రయత్నం మంచిదే అయినా.. జనసేనానితో నడవడానికి ముందుకు వచ్చే పార్టీలు - నాయకుల ఎవరనేదానిపైనే ఏపీ రాజకీయాల్లో సర్వత్రా చర్చ జరుగుతోంది. విభజన హామీల సాధనలో పవన్ చెబుతున్న జేఎఫ్‌సీ ఎంత మేరకు సక్సెస్ అవుతుంది..? యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉన్న నాయకులతో విభజన హమీలను సాధించడం సాధ్యమేనా.. ? అసలు ఈ వేదికతో ఏవరి లాభం.. ? జనసేనానితో జట్టుకట్టే నేతలు ఎందరు..? ఒకవేళ జేఏసీ ఏర్పాటయితే దానిలో పవన్ పాత్ర ఏంటి..? ఇపుడు ఏపీ రాజకీయాల్లో ఇదే చర్చ నడుస్తోంది.
మరోవైపు పవన్ పిలుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన నిధుల వివరాలను టీడీపీ తనకు పంపించాలని కోరుకుంటున్నట్లు అలాగే రాష్ట్రానికి పంపించిన నిధుల వివరాలను బీజేపీ నేతలను కోరుతున్నట్లు పవన్ తెలిపారు. ఈ వివరాలను కమిటీకి పంపిస్తే...ఆ కమిటీ అధ్యయనం చేసి నిజాలు చెబుతుందన్నారు. అయితే పవన్ ఒకనాటి మిత్రపక్షాలు ఆయనకు వివరాలు ఇస్తాయా? వారి ఇవ్వకపోతే పవన్ ఏం చేయనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.