తనపై కుట్ర జరుగుతోందని.. తన తల్లిని దారుణంగా అవమానిస్తారా? అంటూ తీవ్ర ఆగ్రహంతో ట్వీట్ల మీద ట్వీట్లు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫిలిం ఛాంబర్ వద్దకు రావటం తెలిసిందే. ఈ రోజు ఉదయం నుంచి ఫిలిం ఛాంబర్ వద్దకు వచ్చిన ఆయన లోపలే గంటల తరబడి ఉండిపోయాడు.
తన తల్లికి జరిగిన అవమానంపై చర్యలు తీసుకోవాలంటూ కోరిన పవన్.. ఫిలింఛాంబర్ గదిలో రెండు వైపులా తలుపులు మూసేసి ఒక్కరే కూర్చున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. అధికారికంగా ఈ సమాచారాన్ని ఎవరూ ధ్రువీకరించటం లేదు. మరోవైపు పవన్ కు మద్దతుగా ఫిలింఛాంబర్ ఎదుట ఆయన అభిమానులు భారీగా చేరుకున్నారు.
ఉదయం నుంచి నినాదాలు ఇస్తున్న పవన్ అభిమానులు.. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో తమ నినాదాల హోరును పెంచారు. ఫిలిం ఛాంబర్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అతి కష్టమ్మీద నిలువరించారు. మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో ఫిలిం ఛాంబర్ నుంచి బయటకు వచ్చిన పవన్.. తన క్యారవాన్ లో ఉండిపోయారు. అనంతరం వెళ్లిపోయారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తన తల్లిని అవమానించేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలన్న పవన్.. తమకు ఒకరోజు గడువు ఇవ్వాలన్న సూచనతో ఏకీభించినట్లుగా తెలిసిందే. ఒకవేళ.. రోజు వ్యవధిలో నిర్ణయం తీసుకోకుంటే తన కార్యాచరణను ప్రకటిస్తానని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. బయట ఉద్రిక్త పరిస్థితులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారుల సూచన మేరకు పవన్ వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. పవన్ వెళ్లిన కాసేపటికి.. మెగా హీరోలంతా వెళ్లిపోయారు. ఇప్పుడున్న కండీషన్లో తాను కానీ మాట్లాడితే పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందన్న ఉద్దేశంతోనే పవన్ కామ్ గా వెళ్లినట్లుగా తెలుస్తోంది.