జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో జగన్ ప్రభుత్వంపై విమర్శల డోసు పెంచారు. మాటల కంటే చేతల ద్వారానే వైఎస్సార్సీపీ నేతలకు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. వైఎస్సార్సీపీ, టీడీపీలాగా తనకు మీడియా మద్దతు లేకపోవడంతో సోషల్ మీడియాపైనే పవన్ ఆధారపడుతున్నారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించుకుంటూ జగన్ ప్రభుత్వంపై కార్టూన్ల రూపంలో నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికే రోడ్ల దుస్థితి, మద్యపాన నిషేధం, వరదలకు సంబంధించి ప్రభుత్వ తీరును కార్టూన్ల రూపంలో పవన్ కల్యాణ్ తీవ్రంగా ఎండగట్టిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు పవర్‌ఫుల్ సెటైర్ తో జగన్ ప్రభుత్వంపై పవన్ విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో బార్ అండ్ రెస్టారెంట్లకు ఏపీ ప్రభుత్వం వేలం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇవి గతంలో ఎప్పుడూ లేనంతగా కోట్ల రూపాయలు పలికాయి.
కడప జిల్లాలో అయితే ఒక బార్ 1.83 కోట్లు పలికిందంటే బార్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అది కూడా కేవలం మూడేళ్ల కాలానికి మాత్రమే. అయితే కొన్ని చోట్ల వ్యాపారులు సిండికేట్ గా మారి బార్లను కైవసం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఇలా వ్యాపారులు సిండికేట్ కావడం వల్ల జగన్ ప్రభుత్వానికి రూ.100 కోట్ల నష్టం వచ్చిందని సమాచారం.
ఈ నేపథ్యంలో ఈ బార్ల లైసెన్సుల వ్యవహారంపైనే పవన్ కల్యాణ్ కార్టూన్ రూపంలో ఓ అదిరిపోయే సెటైర్ వేశారు. ఈ మేరకు పవన్ సోషల్ మీడియాలో ఒక కార్టూన్‌ను పోస్టు చేశారు. అందులో ఒక వ్యక్తి కింద కూర్చుని మద్యం తాగుతుంటూ ఉంటాడు. అతడి భార్య మద్యనిషేధం అన్నారుగా ఏమైందని ప్రశ్నిస్తుంది. దానికి సీఎం జగన్, ఆయన పక్కన ఉన్న నేత వంద కోట్ల రూపాయలు పోయాయని మేమేడుస్తుంటే.. మధ్యలో మద్యనిషేధం, మద్య నిషేధం అంటూ నీ గోల ఏందమ్మా అంటూ విసుక్కోవడం కనిపిస్తుంది.
ఇలా పవన్ బార్ల లైసెన్సుల వ్యవహారంపై వేసిన సెటైరికల్ కార్టూన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ అభిమానులు, జనసేన పార్టీ శ్రేణులు, నెటిజన్లు దీన్ని లైకులు, కామెంట్లు, షేర్లతో హోరెత్తిస్తున్నారు.