రూమర్: హోదా కోసం ప‌వ‌న్ ఆమ‌ర‌ణ దీక్ష‌..!

Update: 2016-09-09 06:47 GMT
జ‌న‌సేన అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేడు కాకినాడ‌లో మ‌రికొన్ని గంట‌ల్లో తెలుగు వారి ఆత్మ‌గౌర‌వం పేరుతో నిర్వ‌హించ‌నున్న భారీ బ‌హిరంగ స‌భ‌పై ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రిలోనూ న‌రాలు తెగే ఉత్కంఠ కొన‌సాగుతోంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా త‌ప్ప‌నిస‌రిగా ఇవ్వాల‌ని మొన్నామ‌ధ్య తిరుప‌తిలో నిర్వ‌హించిన స‌భ‌లో ప‌వ‌న్ స్టేట్‌ మెంట్ ఇచ్చిన నేప‌థ్యంలో శుక్ర‌వారం నాటి స‌భ‌పై అంచ‌నాలు భారీస్థాయిలో పెరిగిపోయాయి. మ‌రోప‌క్క‌ - కేంద్ర ప్ర‌భుత్వం ఏపీకి ప్యాకేజీ ప్ర‌క‌టిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌డం దానిని ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆహ్వానించ‌డం వంటివి జ‌రిగిన నేప‌థ్యంలో మ‌రి ప్ర‌త్యేక హోదాపై  ప‌వ‌న్ ఏవిధంగా స్పందిస్తారోన‌ని ప్ర‌తి ఒక్క‌రూ ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. అయితే, తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఓ స‌మాచారాన్ని బ‌ట్టి.. ప్ర‌త్యేక హోదా కోస‌మే ప‌వ‌న్ ప‌ట్టుబ‌డ‌తార‌ని, ఈ క్ర‌మంలోనే ఆయ‌న కాకినాడ స‌భ నిర్వ‌హిస్తున్నార‌ని అంటున్నారు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు.

 ఈ స‌భావేదిక‌గా ప‌వ‌న్ ఓ సంచలన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంద‌ని వారు అంటున్నారు. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల అభిప్రాయం ప్ర‌కారం... ప‌వ‌న్ ప్ర‌త్యేక హోదా డిమాండ్‌ తో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు దిగే ఛాన్స్ ఉంద‌ని ఆదిశ‌గానే ప‌వ‌న్ ఆలోచిస్తున్నార‌ని తెలుస్తోంది. ఇదే నిర్ణ‌యం క‌నుక ప‌వ‌న్ తీసుకుంటే రాష్ట్రంలో సంచ‌ల‌నానికి తెర‌దీసిన‌ట్టేన‌ని అంద‌రూ భావిస్తున్నారు. వాస్త‌వానికి జ‌న‌సేన‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డానికి ఇదే మంచి స‌మ‌యమ‌ని ప‌వ‌న్ భావిస్తున్న‌ట్టు కూడా తెలుస్తోంది. ఈ స‌మ‌యంలోనే ఓ మంచి స్టాండ్ తీసుకుని పోరాటానికి సిద్ధ‌ప‌డ‌డం ద్వారా పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లొచ్చ‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఇక‌, కేంద్రం విష‌యానికి వ‌చ్చేస‌రికి ఏడాది కింద‌ట ఏపీకి సంబంధించి ఎలాంటి ప్ర‌క‌ట‌న చేసిందో ఇప్పుడు కూడా ఆర్థిక మంత్రి జైట్లీ అదే ప్ర‌క‌ట‌న చేయ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేమ‌న్న ఆయ‌న అన్ని విధాలా రాష్ట్రాన్ని ఆదుకుంటామ‌ని ప్ర‌క‌టించారు.

పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో కేంద్రమే నిర్వ‌హిస్తుంద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అదేవిధంగా ప్ర‌భుత్వ అభివృద్ధిలో అడుగ‌డుగునా కేంద్రం సాయం చేస్తుంద‌ని చెప్పారు. అయితే, దీనిపై ఎలాంటి పూర్తిస్థాయి వివ‌ర‌ణ లేక‌పోవ‌డంతో ఏపీలో ఆందోళ‌న‌లు మిన్నంటాయి. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం సాయంత్రం ప‌వ‌న్ నిర్వ‌హిస్తున్న భారీ స‌భ‌పై అంద‌రి దృష్టీ ప‌డింది. మ‌రి ప్ర‌త్యేక హోదాపై ప‌వ‌న్ అటు కేంద్రం - ఇటు చంద్ర‌బాబుపై ఆయ‌న ఏవిధంగా కామెంట్లు చేస్తారో చూడాలి. అదేస‌మ‌యంలో హోదా కోసం జ‌న‌సేన త‌ర‌ఫున ఎలా ఉద్య‌మానికి శ్రీకారం చుడ‌తారో చూడాలి. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న వార్త‌ల ప్ర‌కారం .. ప‌వ‌న్ క‌నుక ఆమ‌ర‌ణ‌దీక్ష‌కు దిగితే.. ప‌రిస్థితి మ‌రింత‌గా ఉద్రిక్త‌త‌కు దారి తీసే అవ‌కాశం ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.
Tags:    

Similar News