ఆమెను క‌లిసిన ప‌వ‌న్‌..రాజ‌ధానిపై కీల‌క వ్యాఖ్య‌లు

Update: 2020-01-22 13:51 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ - కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాల‌తో ప‌వ‌న్ భేటీ ఉంటుంద‌నే ప్ర‌చారం సాగ‌గా...ఢిల్లీకి వెళ్లిన ప‌వ‌న్ తొలుత‌ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తో స‌మావేశం అయ్యారు. పవన్ తో పాటు నిర్మలా సీతారామన్ ను కలిసిన వారిలో జీవీఎల్ నరసింహారావు - నాదెండ్ల మనోహర్ ఉన్నారు. అనంత‌రం ప‌వ‌న్ మీడియాతో మాట్లాడుతూ - రాజధానిని మార్చడం చెపుతున్నంత సులువు కాదని అన్నారు.  

ఢిల్లీ వెళ్లిన ప‌వ‌న్ క‌ళ్యాణ్  రాజ‌ధానిలో బీజేపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొంటార‌ని మీడియాకు అన‌ధికార స‌మాచారం ఇచ్చారు. దీంతో పాటుగా ప్రధాని నరేంద్ర మోడీ - జేపీ నడ్డాతో పవన్ సమావేశమయ్యే అవకాశముందని కూడా తెలిపారు. అయితే, వీరితో కాకుండా నిర్మ‌లాసీతారామ‌న్‌ తో ఆయ‌న స‌మావేశం అయి....రాజధాని అంశం మీద చర్చించామని అన్నారు. అమరావతి ఏపీకి శాశ్వత రాజధాని అని పేర్కొంటూ రాజ‌ధాని మార్పు విష‌యంలో బలమైన కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

ఈ సంద‌ర్భంగా బీజేపీకి మ‌ద్ద‌తుగా ప‌వ‌న్ కేంద్ర ప్రభుత్వానికి మ‌ద్ద‌తుగా మాట్లాడారు. కేంద్ర ప్ర‌భుత్వాన్ని భ్రష్టు పట్టించేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని వాళ్లు చెప్పేవన్నీ అబద్ధాలేనని ప్రజలకు చెపుతున్నానని అన్నారు. ఢిల్లీ నుంచి తాను చెపుతున్నానని మూడు రాజధానులతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని పవన్ తెలిపారు. ఏపీలో ప్రభుత్వాలు మారినా - ప్రభుత్వ పనితీరు మాత్రం మారలేదని పవన్ అన్నారు. టీడీపీ - వైసీపీలు రెండూ రెండేనని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. రిపబ్లిక్ డే వేడుకలను విశాఖలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేసుకున్న ప్రభుత్వం చివరకు వెనక్కి తగ్గిందని... మళ్లీ విజయవాడలోనే కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. అమరావతి కూడా అంతేనని ప‌వ‌న్ పంచ్ వేశారు.
Tags:    

Similar News