జనసేనాని పవన్ కళ్యాణ్ నాలుగేళ్ళ పుణ్య కాలం అంతా అలా గడిపేశారు. ఎన్నికల ఏడాదిలో ప్రవేశించాక ఆయన ఇపుడు తొందర పడుతున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ ఏపీలో వైసీపీ రహిత పాలనను గట్టిగా కోరుకుంటున్నారు. దాని కోసం తన వంతుగా ఆయన ఏణ్ణర్ధం క్రితమే ఒక పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు ఇచ్చిన సమయానికి తెలుగుదేశం రాజకీయంగా ఇబ్బందులో ఉంది. ఆ పార్టీకి ఊపు కూడా లేదు.
కానీ అదే సమయంలో పవన్ ఎక్కడికి వెళ్లినా జనాలు వెల్లువలా తరలివచ్చారు. దాంతో ఏపీలో కొత్త రాజకీయ గాలి వీస్తోంది అన్న భావన అయితే జనసేనానికి కలిగినట్లుగా ఉంది. దాంతో తాను సెంటర్ పాయింట్ గా ఏపీలో అన్ని పార్టీలు వైసీపీకి యాంటీగా నిలబడాలని పవన్ కోరుకుంటూ వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వమని పిలుపు ఇచ్చారు.
అయితే అప్పటిదాకా పవన్ తో దోస్తీకి సౌండ్ చేస్తూ వచ్చిన టీడీపీ ఆ పరిణామంతో సైలెంట్ అయింది. అది అలా ఉండగానే గత ఏడాది ఒంగోలులో నిర్వహించిన టీడీపీ మహానాడు సూపర్ సక్సెస్ అయింది. జనమే జనంగా మహనాడు ప్రభంజనం సృష్టించింది. దాతో టీడీపీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. ఇక ఆ మీదట బాదుదే బాదుడు, ఇదేమి ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాలతో నేతలు రోడ్డు మీదకు వచ్చారు. ఈ ఏడాది అయితే మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లను టీడీపీ గెలుచుకుని తన గెలుపు ధీమాను పీక్స్ కి చేర్చేసింది.
ఈ మధ్యలో రెండు సార్లు పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ అయ్యారు. లేటెస్ట్ గా ఈ వీకెండ్ మరోసారి పవన్ వెళ్ళి బాబును కలసి వచ్చారు. అయితే ఈ భేటీలో ఏమి మాట్లాడి ఉంటారు అంటే పొత్తుల గురించే అని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గౌరవప్రదమైన పొత్తులు ఉంటే తాము సమ్మతమే అని చెబుతున్నారు. అంటే అరవై సీట్లను జనసేన కోరుకుంటోంది. అలాగే అధికారంలో వాటాను కూడా కోరుతోంది.
మరి ఇన్ని సీట్లు టీడీపీ జనసేనకు ఇస్తుందా. అది కూడా ఇపుడున్న పరిస్థితుల్లో ఇస్తుందా అంటే కుదరదు అని రాజకీయంగా ఆ మాత్రం అవగాహన ఉన్న వారికి అర్ధమయ్యే విషయం. అయితే దీని మీదనే ఈ మధ్య జనసేన టీడీపీకి చెందిన కొంతమంది నేతలు హైదరాబాద్ లో సమావేశమై సీట్ల గురించి మాట్లాడారు అని ప్రచారం సాగింది. అందులో కూడా ఇదే ప్రతిపాదన జనసేన నుంచి వెళ్ళింది అని అంటున్నారు.
ఇలా సీట్ల దగ్గర ఇపుడు పేచీ అయితే ఉంది. ఈ పీటముడిని ఎవరు విప్పుతారు అంటే అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ అనే అంటున్నారు. మరో వైపు చూస్తే జనసేనకు శ్రేయోభిలాషిగా ఉంటూ వస్తున్న మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య టీడీపీతో పొత్తు ఉంటే కచ్చితంగా అధికారంలో వాటా తీసుకోవాలని రెండు పార్టీలు మొత్తం 175 సీట్లను సరిసమానంగా పంచుకోవాలని సూచించారు. అలా జరిగినపుడే ఈ పొత్తు ఫలిస్తుందని, లేకపోతే తక్కువ సీట్లతో పొత్తు పెట్టుకున్నా అది వికటించి వైసీపీకే మేలు చేస్తుందని కూడా హెచ్చరించారు.
మరి ఈ విషయంలో టీడీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్నదే కీలకమైన విషయంగా ఉంది. అయితే పొత్తులో భాగంగా గరిష్టంగా ముప్పయి సీట్లకు తక్కువ కాకుండా టీడీపీ జనసేనకు ఆఫర్ చేయవచ్చు అని ప్రచారం ఒకటి సాగుతోంది. అదే విధంగా మంత్రి పదవులు కూడా ఆ రెషియో కి తగినట్లుగా నాలుగు వరకూ ఇవ్వవచ్చు అని అంటున్నారు. అంతకు మించి అధికారంలో వాటా అంటే కష్టమే అన్నది వినిపిస్తోంది.
ఇక పవన్ కళ్యాణ్ ఈ పొత్తులకు అంగీకరిస్తారా. ఆయనకు సుముఖంగా ఉన్నా కూడా జనసేన వర్గాలను బలమైన కాపు సామాజిక వర్గాన్ని ఆ వర్గం పెద్దలను ఒప్పించగలుగుతారా అలా పొత్తు కధను విజయవంతం చేసుకోగలుగుతారా అన్నదే చర్చనీయాంశంగా ఉంది. ఏది ఏమైనా జనసేన ఒక తప్పు అయితే చేసింది అన్న మాట వినిపిస్తోంది. ఈ పాటికే జనంలోకి పవన్ వారాహి వాహనం ద్వారా వచ్చి తన సత్తా చాటుకుంటూ పొత్తుల విషయం మాట్లాడితే బాగుంటుందని అంటున్నారు.
అలా కాకుండా పవన్ రాజకీయంగా కొంత సైలెంట్ అయిన నేపధ్యంలో టీడీపీ నుంచి అనుకున్న డిమాండ్లకు సానుకూల స్పందన వస్తుందా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ చంద్రబాబుల మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉందని అంటున్నారు. దాంతో ఎవరెలా అనుకున్నా ఎన్ని ఊహాగానాలు చేసుకున్నా చివరికి పొత్తులు కుదురుతాయని, ఇది వైసీపీకి షాకింగ్ గానే ఉంటుందని అంటున్నారు.