జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన క్రియాశీల రాజకీయాల ప్రయాణంలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పార్టీ కార్యకలాపాలో దూకుడు పెంచిన పవన్‌కల్యాణ్ ప్లీనరీ నిర్వహించేందుకు వేగంగా కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే దూకుడులో మరో ముఖ్య నిర్ణయాన్ని పవన్ తీసుకున్నారు. సొంత ఇంటి నిర్మాణానికి సిద్ధమయ్యారు. నేడు శంకుస్థాపన జరగనుండగా దీనికి పవన్ హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఇంటి దగ్గరే పార్టీ కార్యాలయం కూడా ప్రారంభించేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం.
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సొంత ఇంటి నిర్మాణానికి పవన్ సిద్ధమయ్యారు. గుంటూరు జిల్లా కాజా దగ్గర రెండెకరాల పరిధిలో సొంత ఇంటిని నిర్మించేందుకు జనసేనానికి ఓకే చెప్పేశారు. ఐదో నంబరు జాతీయ రహదారి పక్కన పవన్ ఇంటి నిర్మాణ పనులు ఇప్పటికే కసరత్తు పూర్తయింది. ఆరునెలల్లో ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఎన్నికల నాటికి ఇంటి నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళిక రచించినట్లు సమాచారం. శంకుస్థాపనకు పవన్ సతీసమేతంగా హాజరు అవుతారని భావిస్తున్నారు. అలా కాని పక్షంలో తన సతీమణిని పంపిస్తారని అంటున్నారు. పవన్ సన్నిహితులు - స్నేహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది. గతంలో ఏలూరులో నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఓకే చెప్పిన పవన్ దాన్ని రాజధానికి మార్చుకున్నట్లు సమాచారం. పార్టీ పేరు మీదే స్థలం కొనుగోలు చేసినట్లు చెప్తున్నారు. రెండు ఎకరాల స్థలంలో విశాలంగా ఈ నిర్మాణం ఉండనున్నట్లు సమాచారం.
ఈనెల 14వతేదీన గుంటూరులో జనసేన ప్లీనరీ, బహిరంగ సభ జరగనున్న సంగతి తెలిసిందే. మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ విజయవాడకు రానున్నారు. జనసేన ప్లీనరీ ఏర్పాట్లపై ఆయన పార్టీ నేతలతో విజయవాడలో చర్చించనున్నారు. పార్టీ ప్లీనరీ, బహిరంగ సభల్లో జనసేనాని కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.