ఇప్పటం పర్యటనలో పవన్.. రోటీన్ కు భిన్నమైన లుక్ తో అదరగొట్టేశారు

Update: 2022-11-05 16:30 GMT
రాజకీయాలు అన్నంతనే వైట్ అండ్ వైట్ వేసుకోవాలి. లేదంటే.. ఒక నాయకుడు తన ఆహార్యాన్ని ఒకేలా మొయింటైన్ చేయాలి. అందుకు భిన్నంగా.. ఉండటం అన్నది ఆలోచనకు కూడా సాధ్యం కాదన్నట్లుగా రాజీకయ నేతల తీరు ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే చూస్తే.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని చూస్తే ఈ విషయం మరింత స్పష్టమవుతుంది. ముఖ్యంగా కేసీఆర్ అయితే.. వైట్ అండ్ వైట్ కు తగ్గరు. దాదాపుగా ఒకేలాంటి వస్త్రధారణతో.. కేసీఆర్ అంటే ఇలానే ఉంటారన్నట్లుగా ఉంటారు.

ఇక.. ఏపీ ముఖ్యమంత్రిజగన్మోహన్ రెడ్డిని చూస్తే.. ఆయన ఆహార్యం చాలా భిన్నంగా ఉంటుంది. చిన్నవయసే అయినప్పటికీ పెద్ద వయస్కుడి మాదిరి ఆయన వస్త్రధారణ ఉండటం చూస్తుంటాం.

లైట్ కలర్ ఫ్యాంట్.. ఎక్కువగా క్రీం లేదంటే గోధుమ రంగు ఫ్యాంటు ధరించి.. దాని మీద ఏ మాత్రం సూట్ కాని లైట్ కలర్ బ్లూ షర్టు వేసుకోవటం లేదంటే.. వైట్ షర్టు వేసుకోవటం లాంటివి చేస్తుంటారు. అలా ఎందుకు ఆయన ఆహార్యం ఉంటుందో అస్సలు అర్థం కాదు. చాలా సింఫుల్ గా కనిపించాలన్నట్లుగా ఆయన వస్త్రధారణ ఉన్నప్పటికీ.. ఆయన ధరించే దుస్తులు మాత్రం బ్రాండెడ్ కు ఏ మాత్రం తగ్గవు.

ఇక..విపక్ష నేత చంద్రబాబు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మిగిలిన వారంతా ఒకేలా ఉంటారు. కాస్తోకూస్తో తన వస్త్రధారణతో అందరి చూపు తన మీద పడేలా చేసే నేతల్లో కేటీఆర్.. రేవంత్ ఉంటారు. వీరందరికి భిన్నమైన ఆహార్యం జనసేన అధినేత పవన్ సొంతమని చెప్పాలి. అటు ట్రెడిషనల్ డ్రెస్ కావొచ్చు.. ఇటు ఫార్మల్ కావొచ్చు.. మిగిలిన నేతలు.. అదినేతలకు పూర్తి భిన్నంగా ఆయన డ్రెస్సింగ్ ఉంటుందని చెప్పాలి.

తమ పార్టీకి చెందిన కార్యకర్తల ఆస్తుల్ని అక్రమ నిర్మాణాల పేరుతో జేసీబీతో పగలకొట్టిన అధికారులు తీరునుతప్పు పడుతూ ప్రస్తుతం ఇప్పటం గ్రామంలో పర్యటిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా ధరించిన దుస్తులు రోటీన్ కు భిన్నంగా ఉండటమే కాదు.. అందరి చూపు ఆయన డ్రెస్ మీద ప్రత్యేకంగా పడేలా ఉండటం ఆసక్తికరంగా మారింది.

బ్లూ జీన్స్.. దాని మీద షర్టు.. పైన.. జాకెట్ తో.. సగటు అధినేతలు.. నేతలకు భిన్నంగా కదిలివచ్చే చైతన్య కెరటంలా ఉన్నారంటూ ఆయన అభిమానులు..పార్టీ సానుభూతిపరులు.. కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News