పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం నటుడు కాదు. రాజకీయ నాయకుడు కూడా. కాబట్టి ఏ ప్రత్యేక సందర్భం వచ్చినా ఆయన స్పందించాల్సిందే. కొత్త ఏడాది మొదలైనపుడు శుభాకాంక్షలు చెబుతూ స్టేట్మెంట్లు ఇవ్వాల్సిందే. పవన్ ఈ విషయంలో ఆలస్యమేమీ చేయలేదు. నటుడిగా కొనసాగినన్నాళ్లూ సైలెంటుగా ఉన్న పవన్.. రాజకీయ నేతగా జనాలకు శుభాకాంక్షలు చెబుతూ ప్రెస్ నోట్ ఇచ్చాడు. ఈ ప్రెస్ నోట్లో 2016 జనాలకు ఎన్నో కష్టాలు మిగిల్చిందని వ్యాఖ్యానించాడు పవన్. పెద్ద నోట్ల రద్దుపై పవన్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రత్యేక హోదా విషయంలోనూ పవన్ ఇలాగే స్పందించాడు. జనసేన పార్టీ లెటర్ హెడ్ మీద ఇచ్చిన స్టేట్మెంట్లో పవన్ ఇంకా ఏమన్నాడంటే..
‘‘నా తరుపున... జన సేన శ్రేణుల తరుపున దేశ ప్రజలందరికీ 2017 నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2016 ఎన్నో కష్టాలను ప్రజలకు చవి చూపించి వెళ్లి పోయింది. కరెన్సీ రద్దు రూపంలో సామాన్యులను కాటేసింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను అందని మావి పండుగా మార్చింది. కానీ 2017 మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశలను సంపూర్తిగా నెరవేరుస్తుందని ఆకాంక్షిస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాలు ప్రగతి పదంలో పయనించాలని మనసారా కోరుకుంటూ జై హింద్’’ అంటూ పవన్ ముగించాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/