క‌న్ఫ్యూజ‌న్ ప‌వ‌న్ క్లారిటీగా ఉన్నార‌ట‌

Update: 2018-01-29 04:33 GMT
స‌రికొత్త రాజ‌కీయాన్ని తెలుగు ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయాల‌న్న‌ది జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌గా చెబుతుంటారు. ఆ మాట‌కు వ‌స్తే.. ఆయ‌న నోటి నుంచి ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు వినిపిస్తుంటాయి. స‌రే.. పైన చ‌దివిన మాట‌ను మ‌రోసారి.. కాస్త జాగ్ర‌త్త‌గా ప‌ట్టి..ప‌ట్టి చ‌ద‌వండి. మ‌రోలా ఏమైనా అనిపిస్తుందా?

అనిపిస్తే ఓకే. అనిపించ‌క‌పోతే మేమే చెబుతాం. స‌రికొత్త రాజ‌కీయాల్ని తెలుగు ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేస్తాన‌ని చెప్పే ప‌వ‌న్‌.. ఇప్పుడు అదే ప‌నిని చేస్తున్నారు. ఇంత‌కీ ఆయ‌న ప‌రిచ‌యం చేస్తున్న స‌రికొత్త రాజ‌కీయం ఏమిటో తెలుసా? క‌న్ఫ్యూజ‌న్‌. ఒక విష‌యం మీద ఒక‌సారి చెప్పే మాట‌కు.. రెండో సారి చెప్పే మాట‌కు ఏ మాత్రం పొంత‌న లేకుండా మాట్లాడ‌టం ప‌వ‌న్ స్టార్ట్ చేసిన స‌రికొత్త రాజ‌కీయమ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

విష‌యం ఏదైనా క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌టం.. వాయిదా వేయ‌టం క‌నిపిస్తుంది. తాజాగా అనంత ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న్ను రాబోయే ఎన్నిక‌ల్లో పాత్తుల మాట గురించి ప్ర‌శ్నిస్తే.. ప్రజాభీష్టం మేర‌కు టీడీపీ పొత్తు విష‌యం ఆలోచిస్తాన‌ని చెప్ప‌టం క‌నిపిస్తుంది. ప్ర‌జాభీష్టం అన్న‌దో బ్ర‌హ్మ ప‌దార్థం దాన్ని అర్థం చేసుకోవటం అంత తేలికైన విష‌యం కాదు. అలా అని అక్క‌డి ప‌వ‌న్ ఆగితే ఫ‌ర్లేదు.. ప్ర‌జ‌లు కోరుకున్న‌ప్ప‌టికీ దాని మీద తాను ఆలోచించి నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చెప్ప‌టం ద్వారా.. ప్ర‌జ‌లే ఫైన‌ల్ అని కూడా చెప్పిన‌ట్లే.

ఒక్క పొత్తుల ముచ్చ‌ట‌లోనే కాదు.. రాజ‌ధాని భూముల విష‌యంలో రైతుల‌కు ఇచ్చిన మాట విష‌యంలోనూ.. మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌.. ప్ర‌త్యేక హోదా మీద.. ఇలా ప్ర‌తి విష‌యంలో తొలిసారి చెప్పిన మాట‌కు.. త‌ర్వాతి రోజుల్లో ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌ల‌కు సంబంధం ఉండ‌టం లేద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

ఎందుకిలా చేస్తున్నారంటే దాని వెనుక వ్యూహం ఉంద‌ని చెబుతున్నారు. అదెలానంటే.. ప్ర‌జ‌ల‌కు నిత్యం ఒకే విష‌యాన్ని చెప్ప‌టం ఒక ప‌ద్ధ‌తి. దీంతో ఉండే స‌మ‌స్య ఏమిటంటే.. త్వ‌ర‌గా ఆ మాట‌ల‌కు బోర్ కొడుతుంది. ఆ విష‌యం ప‌వ‌న్‌ కు తెలుసు. అదే స‌మ‌యంలో ఒక విష‌యం మీద స్ప‌ష్ట‌త ఇచ్చిన త‌ర్వాత దానికి క‌ట్టుబ‌డి ఉండాలి. ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌వుతాయోన‌న్న ఆలోచ‌న‌లో ఉండే ప‌వ‌న్‌.. త్వ‌ర‌ప‌డి తాను మాట ఇస్తే.. బ‌ద్నాం అవుతాన‌న్న భావ‌న ఆయ‌న‌లో ఎక్కువ‌ని చెబుతారు.

అందుకే.. ఏ విష‌యంలోనూ స్ప‌ష్ట‌త ఇవ్వ‌కుండా ఆచితూచి అన్న‌ట్లు మాట్లాడుతూనే.. ఏ విష‌యాన్ని తేల్చ‌కుండా విష‌యాన్ని క‌న్ఫ్యూజ్ చేయ‌టం ద్వారా  తానేం చెబుతున్నానో ప్ర‌జ‌ల‌కు అర్థ‌మై కాన‌ట్లు ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. నిజానికి చాలా విష‌యాల్లో ప‌వ‌న్‌ కు క్లారిటీ లేక‌పోలేదని.. త్వ‌ర‌ప‌డి క‌మిట్ అయితే.. త‌ర్వాతి రోజుల్లో ఏమైనా ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌న్న సందేహంతో క‌న్ఫ్యూజ‌న్ కు గుర‌య్యేలా మాట్లాడ‌తార‌ని చెబుతున్నారు. మిగిలిన విష‌యాల్లో క్లారిటీ ఎంత ఉన్నా.. ప్ర‌జ‌ల్ని త‌న మాట‌ల‌తో క‌న్ఫ్యూజ్ అయ్యేలా చేయ‌టంలో ప‌వ‌న్ ఫుల్ క్లారిటీతో ఉన్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Tags:    

Similar News