సీఎం.. సీఎం.. అంటూ అదే పనిగా నినాదాలు చేసే పవన్ అభిమానుల పుణ్యమా అని.. సీఎం కుర్చీ మీద పవన్ కన్ను పడటం తాజాగా బయటకు వచ్చింది. తనకు ప్రజల జీవితాలు బాగుపడటమే తప్పించి.. పదవుల మీద ఎలాంటి ఆశ లేదన్న మాటను జనసేన అధినేత హోదాలో పవన్ ఎన్నోసార్లు చెప్పటం తెలిసిందే.
అయితే.. చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధం ఉండదన్న రీతిలో పవన్ మాటల తీరులో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. సీఎం కావాలన్న ఆశను మాటల్లో చెప్పేస్తున్న పవన్.. తాజాగా మరింత ఓపెన్ అయ్యారు. గతంలో తన అభిమానులు.. తనను ఉద్దేశించి సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేస్తున్నప్పుడు.. ఆయన స్పందించేవారు కాదు.
అప్పుడప్పడు స్పందించినా.. సీఎం కుర్చీ మీద తనకు పెద్ద ఆసక్తి లేదన్నట్లుగా మాట్లాడటం.. సీఎం కుర్చీ కంటే కూడా తనకు ప్రజలకు సేవ చేయటంలోనే ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుందన్న మాటను చెప్పేశారు.
చూశారా.. మా పవన్ కు సీఎం పదవి మీద ఆశ లేదు.. బడుగు జీవుల బతుకుల్ని మార్చాలన్న తపన తప్పించి అంటూ పవన్ అభిమానులు గొప్పలు చెప్పుకునే వారు. ఇకపై.. అలాంటి గొప్పలకు అవకాశం లేదు. ఎందుకంటే.. ఆయన తన మనసులోని మాటను కక్కేశారు. తాజాగా పాల్గొన్న కార్యక్రమంలో దేవుడి దయ ఉంటే తాను ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొనటం గమనార్హం.
పవన్ తీరు చూస్తే.. అభిమానులు అదే పనిగా సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేసిన వైనం ఆయనలో అణగదొక్కబడిన ముఖ్యమంత్రి కోరికను బయటకు చెప్పేలా చేసిందంటున్నారు. అయితే.. ఈ వాదనలో నిజం లేదని వాదిస్తున్నారు. సీఎం కుర్చీలో కూర్చోవాలన్న ఆశ పవన్ కు లేకున్నా.. ఆ విషయాన్ని ఆయన చెబితే పోటీలో లేకుండా పోయే ప్రమాదం ఉందని.. ఈ కారణంతోనే తాను సైతం సీఎం రేసులో ఉన్నానని చెప్పేమందుకే తాజా వ్యాఖ్యలని చెబుతున్నారు. వాదనలు ఎలా ఉన్నా.. సీఎం కుర్చీలో కూర్చోవాలన్న ఆలోచనను పవన్ దాచుకోకుండా బయటకు చెప్పేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.