అనంత‌కు ఇచ్చిన హామీ అంతేనా ప‌వ‌న్‌?

Update: 2019-03-19 04:54 GMT
మిగిలిన రాజ‌కీయ అధినేత‌ల్లా తాను కాద‌ని.. తాను చెప్పే మాట‌కు ముందు మ‌న‌సులో ఎంతో సంఘ‌ర్ష‌ణ ఉంటుంద‌ని.. ప్ర‌తి మాట‌ను ఆచితూచి మాట్లాడ‌తాన‌ని ప‌వ‌న్ చెప్పుకోవ‌టం క‌నిపిస్తుంది. నోటి నుంచి వ‌చ్చే మాట‌కు ఎంతో విలువ ఉంటుంద‌ని.. అందుకే ఆలోచించి మ‌రీ మాట్లాడ‌తాన‌ని జ‌న‌సేన అధినేత గొప్ప‌గా చెబుతుంటారు.

మ‌రి.. అలాంటి ప‌వ‌న్ క‌ల్యాణ్ నోటి నుంచి మాట వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగింద‌నే అనుకుంటారు. కానీ.. తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల్ని చూస్తే ఆయ‌న మాట‌ల్ని అనుమానాల్సి వ‌స్తోంది. ఆయ‌న స్వ‌యంగా ఇచ్చిన హామీ ఈ రోజు చ‌ర్చ‌లో కూడా లేక‌పోవ‌టం ఏమిటి? అన్న ప్ర‌శ్న త‌లెత్త‌క మాన‌దు. దాదాపు రెండు మూడేళ్ల క్రితం అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా తాను అనంతపురం నుంచి పోటీ చేస్తాన‌ని ప‌వ‌న్ చెప్ప‌టం తెలిసిందే.

తాజాగా జ‌రుగుతున్న‌ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప‌వ‌న్ తాను గ‌తంలో చెప్పిన మాట‌ను ప్ర‌స్తావించ‌టం లేదు స‌రిక‌దా.. ఆయ‌న పోటీ చేసే అవ‌కాశం ఉన్న అసెంబ్లీ స్థానాల్లో అనంత‌పురం పేరు అస్స‌లు క‌నిపించ‌ని ప‌రిస్థితి. మొన్న‌టి వ‌ర‌కూ వినిపించిన పేర్ల‌కు భిన్నంగా సోమ‌వారం రాత్రి నుంచి ప‌వ‌న్ విశాఖ గాజువాక నుంచి బ‌రిలోకి దిగుతార‌న్న మాట వినిపిస్తోంది. ఈ విష‌య‌మై అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల కాన‌ప్ప‌టికి.. మ‌రి మొద‌ట చెప్పిన అనంత‌పురం నుంచి బ‌రిలోకి అన్న‌మాట ఏమైంది ప‌వ‌న్‌? అన్న క్వ‌శ్చ‌న్ ప‌లువురి నోట వ‌స్తోంది. మ‌రి.. వీరి ప్ర‌శ్న‌కు ప‌వ‌న్ స‌మాధానం చెబుతారా? ఆ అవ‌కాశం ఉందంటారా?  అన్నింటికి మించి తాను మాటిచ్చిన విష‌యం ప‌వ‌న్ కు గుర్తుందంటారా?
Tags:    

Similar News