పవన్‌ సభలు ఇక అటకెక్కినట్లే!

Update: 2016-09-11 07:35 GMT
కాకినాడ సభతో పవన్‌ కల్యాణ్‌ లో కిక్కు దిగిపోయినట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఇప్పుడే ఆయన కాకినాడ సభ పూర్తయింది గనుక.. ఇంకా ఆ వేడి రాజకీయ వర్గాల చర్చల్లో సజీవంగా నడుస్తూ ఉన్నది గనుక.. మీడియా సంస్థలు పవన్‌ కల్యాణ్‌ ఇంటర్వ్యూలను కూడా వేస్తున్నాయి గనుక.. జనం పట్టించుకుంటున్నారు గానీ.. లేకపోతే ఆయన ప్రసంగం ఈపాటికి మసకబారిపోయేది. కాకపోతే.. ఈ కాకినాడ సభతో పవన్‌ కల్యాణ్‌ తన ప్రత్యేకహోదా పోరాట సభలకు మంగళం పాడేసినట్లుగా కనిపిస్తోంది. ఒక అభిమాని మృతి అనేది పవన్‌ సాకుగా వాడుకుంటున్నారో ఏమో తెలియదు గానీ.. సభలు కాకుండా.. తన పోరాట పంథా మార్చుకుంటానంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

పవన్‌ కల్యాణ్‌ తిరుపతిలో తొలిసభ పెట్టినప్పుడు.. కాకినాడ సభ తేదీని ప్రకటించేశారు. అది అయిన వెంటనే 13 జిల్లాల్లో వరుసగా సభలు ఉంటాయని చెప్పారు. ఆ తర్వాత తన హోదా పోరాటం రెండో దశలోకి వెళ్తుందని చెప్పారు.
తీరా ఇప్పుడు కాకినాడ సభ అయిన తర్వాత , నెక్ట్స్‌ సభ ఎప్పుడో ఎక్కడో ఎవ్వరికీ తెలియదు. పవన్‌ చెప్పలేదు.

అసలు సభలే ఉంటాయో లేదో.. ఆయన ప్రత్యామ్నాయ పోరాటాల గురించి మాట్లాడుతున్నారు కదా.. అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్‌ ఇక సభలు పెట్టరని, ప్రత్యామ్నాయ పద్ధతుల్లో పోరాటం ఏమిటో ఆయన తేల్చేలోగా.. పుణ్యకాలం కాస్తా గడచిపోతుందని.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలనే ఉత్సాహం, వస్తుందనే నమ్మకం రెండూ ప్రజల్లో చచ్చిపోతాయని ప్రజలు అనుకుంటున్నారు.
Tags:    

Similar News