అదేంటి పవన్ ఏంటి జగన్ కి మద్దతు ఏంటి అన్న మాట రావచ్చు. ఒక విధంగా షాకింగ్ గా ఈ విషయం ఉండొచ్చు. కానీ రాజకీయాల్లో ఇలా చూస్తే చాలా తమాషాలు జరుగుతుంటాయి. అల్టిమేట్ గా ప్రజలే కేంద్ర బిందువుగా ఎవరైనా రాజకీయాలు చేయాలి. అటువంటపుడు జనాలను మంచి చేసుకునే క్రమంలో నాయకులు తమ సొంత అభిప్రాయాలో తాము అనుకుంటున్నట్లుగా చెప్పడానికి అసలు వీలు ఉండదు.
ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీకి అతి పెద్ద బలం ఏంటి అంటే సంక్షేమ పధకాలను చక్కగా నిర్వహించడమే. అప్పులు కుప్పగా తెచ్చి పోస్తూ మూడున్నరేళ్ళుగా సంక్షేమానికి వైసీపీ సర్కార్ పెద్ద పీట వేస్తోంది. ఇప్పటిదాకా ప్రారంభించిన ఏ ఒక్క సంక్షేమ పధకం ఆగిపోలేదు. డబ్బులకు ఎక్కడ తంటాలు పడుతున్నారో జనాలకు అవసరం లేదు, తమకు పధకాలు వస్తున్నాయా లేదా అని అంతా ఆలోచిస్తున్నారు.
ఏపీలో ఏ ఎన్నిక జరిగినా ఇప్పటిదాకా వైసీపీ గెలిచింది. దానికి కారణం సంక్షేమ పధకాలు వారికి దక్కడమే. రేపటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా సంక్షేమ మంత్రం తప్పకుండా ఫలించి తమను ఒడ్డుకు చేరుస్తుంది అని వారు వైసీపీ పెద్దలు ధీమాగా ఉన్నారు. అయితే విపక్షాలు మాత్రం సంక్షేమ పధకాల జోలికి రాలేదు కానీ మిగిలిన విషయాలు చాలా మాట్లాడారు, విమర్శలు కూడా చేశారు.
అదేలా అంటే ఏపీ శ్రీలంకలా అప్పుల కుప్ప అవుతోందని, ఏపీలో ఆర్ధిక విద్వంశం జరుగుతోందని ఇలా అనేక రకాలైన ఆరోపణలు అయితే చేశారు. ఈ విషయంలో వైసీపీ కూడా ఏమీ తక్కువ తినలేదు. విపక్షాల విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇవ్వడమే కాకుండా సంక్షేమ పధకాలు పొందుతున్న లబ్దిదారుల మీద వత్తిడి తెచ్చేలా ప్రసంగాలు చేస్తూ వచ్చింది.
మంత్రులు సీనియర్ నాయకుల స్థాయిల స్థాయి నుంచి ఏకంగా సీఎం జగన్ వరకూ అంతా ఒక్కటే మాట మాట్లాడుతూ వచ్చారు. మేము సంక్షేమ పధకాలు అందిస్తునామని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. సంక్షేమ పధకాలు ఆపేయించాలని కూడా కుట్ర చేస్తున్నాయని కూడా చెప్పుకుంటూ వచ్చాయి. ఇటీవల జరిగిన ప్లీనరీలో అయితే జగన్ ఏపీలో పేదలకు పధకాలు లేకుండా చేయడానికి చూస్తున్నాయని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని కుంటరిచ్చారు.
దానికంటే ముందు ఆయన నిండు అసెంబ్లీలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఏపీలో తమ హయాంలో అప్పులు చేసినవి తక్కువ అని ఆ చేసిన అప్పులు కూడా పేదల కడుపు నింపేందుకే అని ఆయన వివరించారు. కరోనా వంటి ఆపద కాలంలో సైతం జనాలకు పని లేకపోతే ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలే ఆసరాగా మారాయని కూడా పేర్కొన్నారు. ఇలా సంక్షేమ పధకాలు నూటికి 87 శాతానికి అందుతున్నట్లుగా వైసీపీ నేతలు లెక్కలు చెబుతున్నారు. జగన్ స్వయంగా ఎమ్మెల్యేలతో నిర్వహించే వర్క్ షాప్ లో కూడా ఇదే విషయం ఏకరువు పెడుతున్నారు.
దాంతోనే ఆయన ధీమాగా 175 కి 175 సీట్లు ఎందుకు గెలవమని కూడా చెబుతున్నారు. ఇక తెల్లకార్డుదారులకు అందుతున్న ఈ సంక్షేమ పధకాలను తీసేసే ధైర్యం ఎవరికీలేదు అనే అంటున్నారు. ఈ మధ్యనే క్రిష్ణా జిల్లా సభలో చంద్రబాబు తమ ప్రభుత్వం వస్తే సంక్షేమం ఇంకా ఎక్కువగా చేస్తామని చెప్పారు. ఇపుడు విజయనగరం పర్యటనలో పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయం చెప్పారు. తమ ప్రభుత్వం ఉన్న పధకాలను తీసేయదని, దాని కంటే ఇంకా ఎక్కువ ఇస్తుందని కూడా ప్రకటించేశారు.
దీంతో జగన్ పధకాలకు జనంలో ఉన్న ఆదరణ చూసే పవన్ ఇలా స్టేట్మెంట్ ఇచ్చారని అంటున్నారు. ఆయన ఈ విధంగా చెప్పడం ద్వారా జగన్ సంక్షేమానికి మద్దతుగా నిలిచారు అని కూడా విశ్లేషిస్తున్నారు. ఇది జగన్ పాలన సక్సెస్ అనడానికి నిదర్శనం అని వైసీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. మరికొందరు అయితే సంక్షేమం జగన్ చేస్తున్నారు. పైసా కూడా అవినీతి లేకుండా నేరుగా జనాలకు ఇస్తున్నారు.
మరి ఇన్ని పధకాలు అందుకుంటున్న ప్రజలు పక్క పార్టీల వైపు ఎందుకు చూస్తారని అంటున్నారు. ఇంకొందరు అయితే జగన్ పధకాలు ఇస్తే శ్రీలంక అవుతుంది అని చెప్పిన పవన్ లాంటి నాయకులు తాము కూడా పధకాలు ఎలా అమలు చేస్తామని అంటున్నారని నిలదీస్తున్నారు. మరి అపుడు ఏపీ ఏం కావాలి అని కూడా సెటైరికల్ గా అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.