ప‌వ‌న్ క‌ల్యాణ్..క‌ర్నూలే నీ మ‌న‌సులో రాజ‌ధాని అన్నావే!

Update: 2019-12-18 14:30 GMT
జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్..ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు ఏం మాట్లాడ‌తాడో ఆయ‌న‌కే తెలియాలి అన్న‌ట్టుగా ఉంటుంది ప‌రిస్థితి. ఇప్ప‌టికే కుల‌ - మ‌త రాజ‌కీయ ప‌ర‌మైన మాట‌ల‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ అభాసుపాల‌య్య‌డు. ప‌వ‌న్ క‌ల్యాణ చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన వ్య‌క్తి అంటూ జ‌న‌సేన‌కు కొంత‌మంది రాజీనామాలు కూడా చేశారు. కుల‌ - మ‌త విద్వేషాల‌ను రెచ్చ‌గొడుతున్న జ‌న‌సేన అధినేత ప్రాంతీయ విద్వేషాల‌ను రెచ్చ‌గొట్ట‌డానికి పెద్ద‌గా వెనుకాడ‌డు కూడా.

ఇది వ‌ర‌కూ ప‌వ‌న్ ప్రాంతీయ విద్వేష‌పు మాట‌ల‌ను కూడా మాట్లాడాడు. గోదావ‌రి జిల్లాల‌కు వెళ్లి.. రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిస్టులు వ‌స్తే త‌ను తోలు తీస్తా అంటూ ప‌వ‌న్ మాట్లాడాడు. ఇక రాయ‌ల‌సీమ‌కు వెళ్లి.. అక్క‌డ అక్క‌డి జ‌నాల‌ను ప్ర‌స‌న్నం చేసుకునే ప్ర‌య‌త్నాలు చేశాడు.

అయితే ఏ ప్రాంత ప్ర‌జ‌లూ ప‌వ‌న్ క‌ల్యాణ్ ను న‌మ్మ‌లేదు. ఆయ‌న పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. రాయ‌ల‌సీమ‌లోనూ ఆయ‌న‌కు ఓటు బ్యాంకు ఏ మాత్రం క‌నిపించ‌లేదు. ఇలా ఎవ్వ‌రిలోనూ విశ్వ‌స‌నీయ‌త‌ను సంపాదించుకోలేక‌పోయిన ప‌వ‌న్ క‌ల్యాణ్ .. ఇప్పుడు రాజ‌ధాని అంశం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌తిపాదించిన మూడు రాజ‌ధానుల అంశాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌తిరేకించాడు.

అయితే ఈ సంద‌ర్భంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌తంలో చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. ఎన్నిక‌ల‌కు ముందు ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌ర్నూలుకు వెళ్లి.. ఆ న‌గ‌ర‌మే త‌న దృష్టిలో రాజ‌ధాని అంటూ ప్ర‌క‌టించాడు. అమ‌రావ‌తి ఉండే ఉండొచ్చు కానీ.. త‌న దృష్టిలో క‌ర్నూలే రాజ‌ధాని అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ అప్పుడు ప్ర‌క‌టించాడు. అలా క‌ర్నూలు త‌న మ‌న‌సుకు ఏపీ రాజ‌ధాని అంటూ ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఇప్పుడు క‌ర్నూలుకు ఏపీ హై కోర్టు ద‌క్క‌డాన్ని స‌హించ‌లేక‌పోతూ ఉన్నాడు. ఆ విష‌యాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ..  ఆయ‌న జ‌గ‌న్ మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నాడు. మొత్తానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ అవ‌కాశ‌వాదాన్ని ఆయ‌నే బ‌య‌ట‌పెట్టుకుంటున్న‌ట్టుగా ఉన్నాడ‌ని ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతూ ఉన్నారు.


Tags:    

Similar News