ఏపీలో ఈ దఫా అసెంబ్లీ ఎన్నికలు సమ్ థింగ్ స్పెషల్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే... ప్రధాన పోటీ అధికార టీడీపీ - విపక్ష వైసీపీల మధ్యే ఉన్నా... ఈ రెండు పార్టీల మధ్య గెలుపోటములను మాత్రం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన నిర్దేశిస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వాదనలో నిజమెంత ఉంది? ఉంటే, గింటే... ఏ మేర జనసేన ప్రభావం ఉండనుంది? అసలు గెలుపోటములను ప్రభావితం చేసేంత బలం పవన్ కు ఉందా? ఈ ఎన్నికల ద్వారా తాను కింగ్ మేకర్ గా అవతరించనున్నానని పవన్ కంటున్న కలలు నిజమవుతాయా? ఇలా జనసేన ఎంట్రీతో చాలా ప్రశ్నలే ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అయితే ఈ ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి కూడా ఖచ్చితమైన సమాధానం లేదనే చెప్పాలి. ఎందుకంటే... అసలు జనసేన పార్టీ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో తెలియదు కదా. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ - 25 పార్లమెంటు సీట్లలోనూ తన పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారని పవన్ ప్రకటించినా... ఆ దిశగా ఇప్పటిదాకా స్పష్టమైన అడుగేదీ కనిపించలేదు. దీంతో అసలు పవన్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారన్న విషయం తెలిస్తే తప్పించి పవన్ ఫ్యాక్టర్ ను అంచనా వేయలేమన్నది విశ్లేషకుల మాటగా వినిపిస్తోంది.
ఇక అదే సమయంలో మొత్తం సీట్లన్నింటా పవన్ పోటీ చేసినా కూడా పరిస్థితి ఇలా ఉంటుందని క్లారిటీగా చెప్పే సాహసం ఏ ఒక్కరూ చేయడం లేదు. ఈ తరహా పరిస్థితికి కారణం ఏమిటన్న విషయాపనికి వస్తే... ఈ ఎన్నికల్లో అధికార టీడీపీకి ఘోర పరాభవం ఎదురు కానుండగా - విపక్ష వైసీపీ బంపర్ మెజారిటీతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమేనని దాదాపుగా అన్ని సర్వేలు చెప్పేశాయి. ఓట్ల శాతాలను కూడా చెప్పేసిన ఆయా సర్వేలు... ఈ ఎన్నికల్లో వైసీపీకి 44 శాతం ఓట్లు పడనుండగా - టీడీపీ మాత్రం 34 శాతం ఓట్లతోనే సరిపెట్టుకుంటుందట. ఇక బీజేపీ - కాంగ్రెస్ పార్టీల ఓట్ల శాతాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అయితే కొత్త పార్టీ అయినా కాపుల ఓట్లను గంపగుత్తుగా తన ఖాతాలో వేసుకుంటుందన్న భావనతో జనసేనకు ఓ 10 శతం మేర ఓటింగ్ దక్కుతుందన్న అంచనాలున్నాయి. మరి వైసీపీ - టీడీపీల మధ్య ఉన్న ఓట్ల శాతంలో కనిపిస్తున్న వ్యత్యాసానికి ఈక్వల్ స్థాయిలో ఓట్లను సాధించే అవకాశాలున్నాయని భావిస్తున్న జనసేన నిజంగానే గెలుపోటములను ప్రభావితం చేయనుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయినా గడచిన ఎన్నికల్లో జనసేన తన మద్దతును టీడీపీకి ఇచ్చేసి ఆ పార్టీని విజయతీరాలకు చేర్చిన సంగతి తెలిసిందే.
మరి ఇప్పుడు జనసేన ఒంటరి పోరు - వైసీపీకి తన కంటే ఓ 10 శాతం మేర అదనపు ఓటింగ్ ఉంటే... టీడీపీ గెలిచేదెలా? గడచిన ఎన్నికల్లో తనకు పడిన ఓట్లలో 10 శాతం జనసేనదే కదా. ఇప్పుడు ఆ 10 శాతం జనసేన చీల్చేయగా... టీడీపీ ఓటింగ్ మరింతగా తగ్గిపోవడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది. ఈ తగ్గుదల ఏఏ ప్రాంతాల్లో కనిపిస్తుందన్న విషయానికి వస్తే... కాపులు అత్య ధికంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంటుందని తెలుస్తోంది. అదే రాయలసీమ ప్రాంతానికి వెళితే... కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అది కూడా బలిజ సామాజిక వర్గం అధికంగా ఉన్న చోట్ల మాత్రం పవన్ ఓ మోస్తరుగా ప్రభావం చూపగలరు. ఇక ఉత్తరాంధ్రలో పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఏ ఒక్కరికి కూడా అర్థం కాని పరిస్థితి. మొత్తంగా ఎంతగా తల బద్దలు కొట్టుకుంటున్నా... ఈ దఫా ఎన్నికల్లో జనసేన ఏ మేర ప్రభావం చూపుతుంది? ఆ ప్రభావంతో ఎవరికి గెలుపు దక్కుతుంది? ఎవరిని పరాజయం దెబ్బేస్తుంది? అన్న విషయాలు తేలడం లేదు. మొత్తంగా చెప్పాలంటే... ఎన్నికలు ముగిసిన తర్వాత గానీ జనసేన ప్రభావం - పీకే ఫ్యాక్టర్ లను అంచనా వేయలేమేమోనన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
...ఎస్ ఆర్ కే