పవన్ మాట చెల్లుబాటయ్యేట్లు లేదే ?

Update: 2021-01-27 07:30 GMT
ఒకవైపేమో మిత్రపక్షాల్లో ఏపార్టీ తరపున అభ్యర్ధి పోటీ చేస్తారన్నది ముఖ్యం కాదని బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ప్రకటిస్తారు. వెంటనే బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో మాత్రం బీజేపీ అభ్యర్ధే పోటీలో ఉంటారంటూ భరోసా ఇస్తారు. రెండు స్టేట్మెంట్లిచ్చేది ఒకరే కావటంతోనే కమలంపార్టీ వైఖరి అనుమానస్పదంగా మారిపోయింది. మరి ఈ పరిస్ధితుల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట చెల్లుబాటవుతుందా ? ఇక్కడే జనసేన నేతలు, కార్యకర్తలు బీజేపీపై మండిపోతున్నారు.

ఇక్కడ ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అదేమిటంటే తొందరలో జరగబోయే లోక్ సభ ఉపఎన్నికలో పోటీ చేయటానికి రెండుపార్టీలు దేనికదే రెడీ అయిపోతున్నాయి. క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను బట్టి చూస్తే పోటీ చేసే అవకాశం బీజేపీ ఎట్టి పరిస్దితుల్లోను జనసేనకు ఇచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువనే చెప్పాలి. బీజేపీ బలమంతా కేంద్రంలో అధికారంలో ఉండటం తప్ప మరోటిలేదు. కేంద్రంలో ఉన్న అధికారాన్ని చూసుకుని అనేక రాష్ట్రాల్లో ఎగిరెగిరి పడుతోంది.

ఇందులో భాగంగానే తెలంగాణా, ఏపిల్లో ఎక్కడా ఆగటం లేదు. తెలంగాణా సంగతిని పక్కనపెట్టేస్తే ఏపిలో ఎలాగైనా సరే ఉపఎన్నికలో గెలవాలనే పట్టుదలతో ప్లాన్లు వేస్తున్నారు  బీజేపీ నేతలు. పవన్ను కలిసినపుడు అభ్యర్ధి ఎవరన్నది ముఖ్యం కాదని చెబుతునే ఇదే సమయంలో బీజేపీ అభ్యర్ధికే ఓట్లు వేయాలని కమలం నేతలు తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అంటే పవన్ పై బీజేపీ చీఫ్ వీర్రాజు మైండ్ గేమ్ ఆడుతున్న విషయం స్పష్టమైపోతోంది.

ఉపఎన్నికలో పోటీ చేయాలంటే తక్కువలో తక్కువ రూ. 50 కోట్లయినా అవసరం. తిరుపతి ఎస్సీ నియోజకవర్గం కాబట్టే ఈ ఖర్చు. అదే ఓపెన్ క్యాటగిరి అయ్యుంటే ఇంతకు రెండింతలు ఖర్చు తప్పదు. మరి ఇంత భారీ ఖర్చును బీజేపీ అభ్యర్ధి అయితేనే తట్టుకోగలరు. ఎందుకంటే కమలం పార్టీ అభ్యర్ధి ఖర్చులో ఎక్కువభాగం పార్టీ పెట్టుకునే అవకాశాలున్నాయి. అదే జనసేన అభ్యర్ధి అయితే బీజేపీ ఖర్చులు పెట్టేది అనుమానమే. మరి ఖర్చును పవన్ భరిస్తారా ? ఇటువంటి అనేక కారణాలతో బీజేపీ అభ్యర్ధే పోటీ చేయటమే సబబుగా ఉంటుందని పవన్ తో వీర్రాజు భేటిలో గట్టిగా చెప్పారట.  చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.
Tags:    

Similar News