వ్యక్తిగత జీవితంలో అయినా.. వ్యూహాలు ముఖ్యం. సమస్యలు కేవలం రాజకీయాల్లోనే లేవు. వ్యక్తులు.. కుటుంబాల్లోనూ వస్తుంటాయి. వాటిని జయించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగడం అత్యంత కీలకం. లేకపోతే ఆ కుటుంబాలు కుప్పకూలిన పరిస్తితులు అనేక కళ్లకు కడుతున్నాయి. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. ఇన్నాళ్లయినా, ఇన్నేళ్లయినా.. జనసేనకు ఒక వ్యూహం అంటూ లేకపోడమే. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తారో.. ఆ పైవచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తారా? అనేది పక్కన పెడితే.. అసలు పార్టీని నడిపించే వ్యూహం ఏది? అనేది ప్రశ్న.
పార్టీ చిన్నదైనా.. పెద్దదైనా.. ఎన్నికలు ఉన్నా లేకున్నా.. ఒక వ్యూహం అంటూ ఉండాలి. కేవలం అధినేత చుట్టు తిరిగే రాజకీయాలు ఎన్నాళ్లో మనలేవు. పైగా జనసేన వంటి అత్యంత కీలకమైన పొజిషన్‌లో ఉన్న పార్టీలకు వ్యూహాలు అత్యంత కీలకం. తాజాగా వచ్చే ఎన్నికల్లో కాకపోతే.. అంటూ.. పవన్ వ్యాఖ్యానించి నాయకులను డోలాయమానంలో పడేశారు. పవన్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా.. ఎప్పుడు పార్టీ మారాలా? అని ఎదురు చూస్తున్నవారు.. ప్రత్యామ్నాయం కోరుకుంటున్న వారు.. ఈ వ్యాఖ్యలతో సతమతం అయ్యారు.
మరోవైపు, ఎన్నికల్లో గెలుపు ఎలా ఉన్నా.. పార్టీనిముందుకు నడిపించాలంటే.. వ్యూహమే కీలకం. జిల్లాల స్థాయిలో చూసుకుంటే 26 జిల్లాలు.. పోనీ.. పాత 13 జిల్లాలను తీసుకున్నా.. జిల్లాకో ఇంచార్జ్ ఉండాలి. కానీ, జనసేనలో పది మంది కూడా లేరు.
నియోజకవర్గాల్లో నాయకులు ఉండాలి.. అది కూడా కనిపించడం లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారు ఎక్కడున్నారు? అంటే.. అధినేతకే తెలియని పరిస్థితి. ఇక, నన్ను గెలిపించండి.. అంటే.. అసలు ఈ నినాదాన్ని గ్రామాల్లోకి తీసుకువెళ్లి ప్రచారం చేసే సైన్యమే లేనప్పుడు..సాధ్యమేనా? అనేది ప్రశ్న.
మరోముఖ్యమైన విషయం.. వచ్చే ఎన్నికల్లో ఎన్ని నియోజకవర్గాల్లో ఎంతమందికి టికెట్లు ఇస్తారు? అసలు 175 మందిలో పట్టుమని 50 మంది బలమైన నాయకులు.. విజయమో.. వీరస్వర్గమో తేల్చుకుని వస్తామని చెప్పగలిగే నేతలు.. ఉన్నారా? అనేది మరో వాదన. గత ఎన్నికల్లోనే నాయకులు లేక.. వదులుకున్న నియోజకవర్గాలు నాలుగు పదుల్లో ఉన్నాయి.
మరి ఇప్పటికి కూడాఈ సమస్యలపై పరిష్కారం చూపకుండా.. పోరు సల్పితే.. నన్ను మించిన వారు లేరంటూ ప్రచారం చేసుకోవడం ఒక్కటే .. మళ్లీ ఎన్నికల తర్వాత కూడా మిగులుతుందని పార్టీ అభిమానులు శ్రేయోభిలాషులే వ్యాఖ్యానిస్తున్నారు. చేతినిండా నాయకులు ఉన్న టీడీపీనే ఉక్కపోతతో అల్లాడిపోతోంది. చేతినిండా అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండే.. వైసీపీ బిక్కటిల్లుతోంది. ఇలాంటి సమయంలో ఏమీ లేని పవన్ ఎలాంటి వ్యూహం లేని పవన్ ఎలా జయిస్తారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.