గాజువాకలోనూ పవన్ సారుకు అంత వీజీ కాదట

Update: 2019-04-12 09:03 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలో దిగిన రెండు నియోజకవర్గాల్లో ఒకటి విశాఖ జిల్లా గాజువాక ఒకటి. విశాఖ జిల్లాలో అతి పెద్ద నియోజకవర్గమైన గాజువాక నుంచి తాను బరిలో దిగుతానని పవన్ ప్రకటించినంతనే.. ఆయన గెలుపు ఖాయమైందన్న మాట వినిపించింది. ఆయన రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నా.. గాజువాకలో గెలుపు కన్ఫర్మ్ అన్న మాట పలువురు నోట వినిపిస్తూ ఉంది. తాజాగా జరిగిన పోలింగ్ నేపథ్యంలో పవన్ గెలుపు అంత వీజీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఊహించిన రీతిలో చోటు చేసుకన్న పరిణామాలు దీనికి కారణంగా చెబుతున్నారు. తొలి నుంచి పవన్ కు గట్టి పోటీ ఇచ్చేది టీడీపీ అభ్యర్థి అనుకున్న వారి అంచనాలకు భిన్నంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి బలమైన పోటీ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.

పోలింగ్ ముగిసిన నేపథ్యంలో పవన్ గెలుపుపై మొదట్నించి నమ్మకంగా చెబుతున్న వారు.. ఇప్పుడు ఉత్కంటకు గురి కావటం ఆసక్తికరంగా మారింది. 3.09లక్షల ఓట్లు ఉన్న గాజువాకలో టీడీపీ తరఫున పల్లా శ్రీనివాసరావు బరిలో నిలిస్తే.. జగన్ పార్టీ తరపున తిప్పల నాగిరెడ్డి పోటీకి దిగారు.

2009లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా.. 2014లో జగన్ పార్టీ అభ్యర్థిగా వరుస ఓటములు ఎదుర్కొన్న ఆయన.. ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుకున్నారు. తన వయసు రీత్యా తర్వాతి ఎన్నికల బరిలో తాను నిలిచే అవకాశం లేదని.. ఈ ఒక్కసారికి తనను ఎమ్మెల్యే చేయాలని నియోజకవర్గ ప్రజల్ని ఆయన అదే పనిగా వేడుకోవటం పలువురి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రచారమే పవన్ కు పోటీగా మారుతారని భావించిన పల్లాను వెనక్కి నెట్టి.. నాగిరెడ్డి ముందుకు వచ్చారు.

ఇదిలా ఉంటే.. చివర్లో వడదెబ్బ కారణంగా గాజువాకలో ప్రచారం చేయలేకపోవటం.. కీలకమైన పోలింగ్ వేళ ఈవీఎంలు పని చేయకపోటంతో పెద్ద ఎత్తున ఓట్లు వచ్చి వెనక్కి వెళ్లిపోయారు. ఇవన్నీ పవన్ ను ప్రతికూలాంశాలుగా చెబుతున్నారు. అలా అని ఆయన ఓటమి కన్ఫర్మ్ అయినట్లు చెప్పట్లేదు కానీ.. అందరూ అంచనా వేసినట్లుగా ఆయన గెలుపు కేక్ వాక్ కాదన్న మాట వినిపిస్తోంది. గాజువాకలో గెలుపు ఖాయమన్న పవన్ అభిమానులు తాజా విశ్లేషణలతో కాసింత నిరాశకు గురైనట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News