పవన్ కల్యాణ్ లో ఉన్నట్టుండి దేశభక్తుడు నిద్ర లేచాడు. ఈ దేశభక్తుడు ఇప్పుడు పక్క బీజేపీ భక్తుడిలా మాట్లాడాడు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని హీరో అని అంటున్నాడు పవన్ లోని దేశభక్తుడు. మొన్నటి వరకూ విప్లవం - ఎర్రజెండా - కామ్రేడ్ - చేగువేరా అని వ్యాఖ్యానాలు చేసిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు కాషాయధారులను త్యాగమయులు అంటున్నారు. మోడీ గొప్ప నేత అని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇటీవలి ఎన్నికల ముందే పవన్ కల్యాణ్ ఎలా మాట్లాడాడో అందరికీ తెలిసిందే. జనసేన అధిపతి అప్పుడు బీజేపీ తీవ్రంగా విమర్శించారు. మోడీ మోసం చేశారన్నారు. బీజేపీతో జత కట్టేదే లేదన్నారు. కమలం పార్టీ వాళ్లు ఎన్నికల కోసం పాక్ తో యుద్ధం తెచ్చారు అన్నట్టుగా మాట్లాడారు జనసేన అధిపతి. అప్పుడంతా చంద్రబాబు నాయుడు బీజేపీని విమర్శిస్తూ ఉంటే, పవన్ కల్యాణ్ ఎర్రజెండాల వాళ్లతో కలిసి బీజేపీని విమర్శించారు.
అయితే ఇప్పుడు పవన్ రూటు మారిన సంగతి తెలిసిందే. పవన్ కు ఇప్పుడు బీజేపీ సిద్ధాంతాలు బాగా రుచిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా కమలం పార్టీ వాళ్లను పొగుడుతూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కల్యాణ్. ఇటీవల మాట్లాడుతూ.. అమిత్ షాను ఆకాశానికెత్తాడు పవన్. ఆ తర్వాత బీజేపీతో పొత్తు అని చేతులు కలిపారు. ఈ నేపథ్యంలో కాషాయవాద దేశభక్తిని పవన్ చూపుతూ ఉన్నారు. ఇది అవకాశవాద దేశభక్తి అని వేరే చెప్పనక్కర్లేదు. తన రాజకీయ అవకాశవాదానికి ఇలా దేశభక్తిని మిక్స్ చేసి.. భారత మాత పిలిస్తే తను రాజకీయాల్లోకి వచ్చినట్టుగా పవన్ ప్రకటించుకోవడం ప్రహసనంగా మారింది. ఈ భారతమాత పిలుపు అంటూ పవన్ చేసిన వ్యాఖ్య సోషల్ మీడియా వైరల్ గా మారుతూ ఉంది. దీన్నొక జోక్ గా ట్రీట్ చేస్తున్నారు నెటిజన్లు.