జనసేనాని పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు అమవాస్య చంద్రుడి వలే చాలా రోజులకు అజ్ఞాతం వీడి అమరావతి జనారణ్యంలో వచ్చారు. పోలీసులను కాల్చండూ అంటూ ఘీంకరించారు. రైతుల పక్షాన నిలిచి పోరాడారు.. ఈ ఘటన అమరావతిలో టెన్షన్ వాతావరణాన్ని సృష్టించింది.
అమరావతిలో రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నారు. రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాన్ మంగళవారం ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వెళ్లడానికి రెడీ అయ్యారు. మందడం గ్రామానికి వెళుతున్న సమయంలో సీఎం జగన్ సచివాలయంలో సమీక్ష చేస్తున్నారని పోలీసులు పవన్ ను వెళ్లకుండా అడ్డుకున్నారు. కానీ పవన్ మాత్రం పోలీసులను దిక్కరించి వినకుండా ముందుకెళ్లారు. ఇనుప కంచెలు సైతం దాటుకొని వెళ్లారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సీరియస్ అయిన పవన్.. ‘కాల్చితే కాల్చుకోండి ’ అంటూ పోలీసుల తుపాకులకు ఎదురెళ్లి వారిపై మండిపడ్డారు. తాను కూడా పోలీసు కొడుకునే అని ఒకొనొక దశలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు దిగి నడుచుకుంటూ వెళ్లిపోయారు.
అనంతరం రాజధాని రైతులను కలిసి వారి పోరాటానికి మద్దతు తెలిపారు. రాజధాని మార్పుకు వ్యతిరేకంగా ప్రసంగించారు.