వరుస ట్వీట్లతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదే రీతిలో మరోమారు పెద్ద నోట్ల రద్దుపై తాజాగా స్పందించారు. నోట్ల రద్దు ఫార్స్ గా అభివర్ణించిన పవన్ ఈ నిర్ణయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్యూలో నిలబడి అమాయకులు చనిపోతున్నారు, కానీ నల్లకుబేరులు మాత్రం ఇంట్లో కూర్చుని దర్జాగా నగదు మార్చుకుంటున్నారని మండిపడ్డారు. అధికారుల తీరు సరిగా లేదంటూ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పై ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, బ్యాంకులు-ఏటీఎంల వెంట నిలబడి అమాయకులు చనిపోతున్నారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నల్లకుబేరులు మాత్రం ఇంట్లో కూర్చుని నగదు మార్చుకుంటుండగా... గిరిజనులు - రైతులు - కూలీలు - గృహిణులు - ఉద్యోగులు - వృద్ధులు - చిరువ్యాపారులు ఇబ్బంది పడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. దేశంలోని దోపిడీదారుల జాబితాతో కొందరు బ్యాంకు ఉద్యోగులు కూడా చేరిపోయారని పవన్ కళ్యాణ్ విస్మయం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దుకు డిజిటల్ లావాదేవీలే పరిష్కారం అని చెప్తున్న వారు క్షేత్రస్థాయి వాస్తవాలు ఎందుకు తెలుసుకోవడం లేదని వ్యాఖ్యానించారు.మలమూత్రాలు చేతులతో ఎత్తే దేశంలో నగదు రహిత లావాదేవీలు సాధ్యమేనా అని పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/