ఓడిపోయాను..కానీ పారిపోను..ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌

Update: 2019-05-23 16:31 GMT
హోరాహోరీగా సాగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏపీలో జ‌న‌సేన ఘోర‌పరాజ‌యం పాలైన సంగ‌తి తెలిసిందే. మొత్తం 175 స్థానాల‌కు గాను కేవ‌లం ఒక్క‌టంటే ఒకే స్థానంలో జ‌న‌సేన విజ‌యం సాధించింది. పోటీ చేసిన రెండు చోట్లా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓట‌మి పాల‌య్యారు. జనసేనకు సైలెంట్ ఓటింగ్ జరిగిందని - మే 23న తమ సత్తా ఏంటో తెలుస్తుందని.. ఈ ఎగ్జిట్ పోల్స్‌ కు అందని రీతిలో జనాలు తమకు ఓటేశారని చాలా మంది జనసైనికులు నమ్మకంగా ఉండ‌గా...ఇలా ఊహించ‌ని షాక్ త‌గిలింది.

ఈ నేప‌థ్యంలో విజయవాడ జనసేన పార్టీ కార్యాల‌యంలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. త‌న కడ శ్వాస వరకు రాజకీయాల్లోనే ఉంటాన‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. ``నేను రెండు స్థానాల్లో ఓడిపోయినా పారిపోయే ప్రసక్తే లేదు. జనసేన పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియ జేస్తున్న. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన జగన్ మోహన్ రెడ్డికి నా శుభాకాంక్షలు. కేంద్రంలో మరోసారి సత్తా చాటిన నరేంద్ర మోడీకి నా శుభాకాంక్షలు. ప్రజా పోరాట యాత్ర ల ద్వారా ప్రజలకు చేరువయ్యా. ప్రజా సమస్యలపై మరింత బలంగా పోరాటం చేస్తా`` అని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు.

కాగా, ఏపీ ఎన్నికలపై జనసేన ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుందని సీ-ఓటర్ ఇండియా సర్వే పరోక్షంగా వెల్లడించింది. టీడీపీకి 36.5 శాతం ఓట్లు - వైఎస్ ఆర్సీపీకి 34.9 శాతం ఓట్లు పడ్డాయని సీ-ఓటర్ ఇండియా అంచనా వేసింది. జనసేన - దాని భాగస్వామ్య పక్షాలకు 20 శాతానికిపైగా ఓట్లు పడనున్నాయ‌ని జోస్యం చెప్పంది. అయితే, రెండు చోట్లా పోటీ చేసిన ప‌వ‌న్ రెండింటా ఓట‌మి పాల‌య్యారు.
Tags:    

Similar News