జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా పరిణామాలపై ట్విట్టర్‌లో స్పందించారు. తనపై కొందరు కేసులు పెట్టారని... తాను ఎవరికీ భయపడనని అంటూ... జైలుకు వెళ్లడానికైనా, కోర్టుకు వెళ్లడానికైనా తాను సిద్ధమేనని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణలో ఇటీవలి పరిణామాలపై ఆయన ఇంతకుముందు విలేకరులతో మాట్లాడడం... ఆ సందర్భంగా వివిధ విషయాలపై తన అభిప్రాయం తెలియజేయడం తెలిసిందే. దానిపై భిన్న స్పందనలు వచ్చాయి. ఆయన తెలంగాణను ఏమీ అనలేకపోయారని... తెలుగుదేశం ఎంపీలకు మాత్రం గడ్డిపెట్టారని పలువురు అభిప్రాయపడ్డారు. దీనిపై తెలుగుదేశం ఎంపీలు కూడా స్పందిచి పవన్ పై విరుచుకుపడ్డారు. అయితే... తమ సీఎంను పవన్ అవమానించారంటూ తెలంగాణ లాయర్ల జేఏసీ పవన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిందట.... దీనికి స్పందనగానే పవన్ ఇప్పుడు ట్వీట్ చేశారు.
తెలంగాణ లాయర్ల జేయేసీ ఫిర్యాదు నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిర్యాదు చేసినంత మాత్రాన జైలుకు వెళ్లాల్సివచ్చినంతగా ఆయన జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేనంటూ వ్యాఖ్యానించడంపై మాత్రం చాలామంది ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఊరికే అందరి దృష్టిలో పడేందుకు పెట్టిన కేసుల విషయంలో ఇంతగా రెస్పాండవడం... జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే అనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే పవన్ టీడీపీ ఎంపీలపైనా పవన్ ట్విట్టర్‌లో స్పందించారు. తనను తిడితే ప్రత్యేక హోదా రాదని... మీ ప్రతాపం నాపై కాదు మోడీపై చూపించండి అంటూ తాజాగా కౌంటర్ ఇచ్చారు. దాంతో పాటు చిన్నపాటి వివరణా ఇచ్చారాయన.... ఎంపీలు వ్యాపారం చేయడం తప్పు కాదు కానీ, వ్యాపారమే చేయడం తప్పంటూ వివరణాత్మక ట్వీట్ చేశారు. కాగా.. పవన్ సైన్యమైన జనసేన కార్యకర్తలు మాత్రం ఈ విషయంలో మరో ముందడుగు వేశారు. పవన్ ట్విట్టర్‌కు పరిమితంగా కాగా కార్యకర్తలు మాత్రం కేశినేని నానికి వ్యతిరేకంగా విజయవాడలో ఆందోళనలు చేశారు. వారు పవన్ ను అడిగి చేశారో లేదో కానీ... ఆయన కంటే వారే నయమని మాత్రం అందరితో అనిపించుకున్నారు.