టీవీ.. ఇప్పుడు గొప్ప ప్రసారమాధ్యమం.. దీని ద్వారా ఒక్కరోజులో హీరో అయిపోవచ్చు. ప్రజాసేవలో ఉండి ఐదేళ్లు చేసినా దక్కని మైలేజీ టీవీల్లో ఒక్కరోజు కనిపిస్తే వచ్చేస్తుంది. ప్రసారమాధ్యమాలకు ఉన్న పవర్ అలాంటిది.. తిమ్మిన బమ్మిని చేసి అనామకులను హీరోలుగా చేసిన ఘనత టీవీల సొంతం.. కత్తి మహేష్ - శ్రీరెడ్డి వంటి వాళ్లను పాపులర్ చేసింది ఈ ప్రసారమాధ్యమాలే..
జనాలకు త్వరగా చేరువ చేసేవి ప్రసార మాధ్యమాలే.. రాజకీయాల్లోకి వెళ్లి ఎంతప్రచారం చేసినా రాని క్రేజ్ ఒక్క టీవీ షోతో వచ్చేస్తుంది. అందుకే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రెండో మార్గాన్ని ఎంచుకున్నారని తెలిసింది. హిందీలో అమీర్ ఖాన్ హోస్ట్ గా పాపులర్ అయిన ‘సత్యమేవ జయతే’ షో ప్రేరణతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఓ బుల్లితెర షో చేసేందుకు రెడీ అవుతున్నారని జనసేన వర్గాలు తెలిపాయి. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు, ప్రజా సమస్యలను బాహ్య ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ ప్రోగ్రాం ఉంటుందని జనసేన పార్టీ వర్గాలు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ధృవీకరించాయి.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో రాజకీయ యాత్రను పూర్తి చేశారు. ఇంకా ఏపీ మొత్తం తిరగాల్సి ఉంది. రాజకీయాల ద్వారా మొత్తం ప్రజలను కలుసుకునే వీలు లేకపోవడంతో ఈ షోను ఉపయోగించుకొని ముందుకు వెళ్లాలనే ఆలోచనలో పవన్ ఉన్నట్టు తెలిసింది. తన రాజకీయ జీవితానికి అనుకూలంగా ఈ షోను మలిచేందుకు పవన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.