తెలుగు రాష్ట్రాల్లో తాజాగా కొత్త ప్రచారం ఒకటి సంచనలనం కలిగిస్తోంది. అందులో నిజానిజాలెంతన్నది పక్కనపెడితే ప్రజలు మాట్లాడుకోవడానికి మాత్రం బ్మహ్మాండమైన టాపిక్ గా మారిపోయింది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో ఆయన అన్నయ్య ప్రస్తుత కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి చేతులు కలుపుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కొధ్దికాలంగా రాజకీయంగా భిన్న ధ్రువాలుగా ఉంటున్న చిరు, పవన్ ల మధ్య మధ్యవర్తిత్వం నెరిపింది స్వయంగా చిరు తనయుడు హీరో రామ్ చరణ్ తేజ, మేనల్లుడు అల్లు అర్జున్ లేనని వినిపిస్తోంది. చిరంజీవి జనసేన పార్టీలోకి రావడానికి అంగీకరించినట్లు కూడా ప్రచారం సాగుతోంది. తన 150 సినిమా నిర్మాణం పూర్తి కాగానే జనసేన లోకి వచ్చి రాజకీయాలను పూర్తి స్థాయిలో నడిపే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్లు చెబుతున్నారు.
చిరంజీవి 150వ సినిమాను నిర్మిస్తున్న రామ్ చరణ్ తేజా బాబాయ్ పవన్ కళ్యాణ్ నిర్మించే సినిమాలో నటించబోతున్నారు. 2018నాటికి మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే గొడుగు కిందికి వచ్చి మల్టీ స్టారర్ చేసే అలోచనలో ఉన్నట్లు చాలా రోజులుగా వినిపిస్తోంది. ఇటీవల ఈటీవీ వేడుకల్లో చిరు, పవన్ లు ఒకే వేదికపై కనిపించారు.
చిరంజీవి కుటుంబం రాజకీయ ప్రవేశం చేసిన తరువాత అన్నదమ్ములిద్దరూ కలిసి పనిచేశారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించారు. యంత్రాంగం, మందీమార్బలం లేకుండా ఆయన తెలుగుదేశం, బిజెపి కూటమికి మద్దతు ఇచ్చి, ప్రచారం సాగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకంగా మారిందనే విషయం అందరికీ తెలిసిందే.
పార్టీని స్థాపించినప్పటికీ పూర్తి స్థాయి నిర్మాణం చేయడంలో, కార్యకలాపాలను నిర్వహించడంలో పవన్ కళ్యాణ్ సమయం వెచ్చించలేకపోతున్నారు. వివిధ విషయాలపై అప్పుడప్పుడు ప్రతిస్పందిస్తున్నారు. ట్విట్టర్‌ను వాహికగా చేసుకుని ఆయన మాట్లాడుతున్నారు.
సినిమాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కు రాజకీయాలపై సమయం వెచ్చించే వెసులుబాటు లేదు. దాంతో చిరంజీవిని రంగంలోకి దించే ఆలోచనలో మెగా ఫ్యామిలీ ఉన్నట్లు చెబుతున్నారు. అన్నయ్యను ముఖ్యమంత్రిగా చూడడమే పవన్ కళ్యాణ్ లక్ష్యం కూడా అంటున్నారు. వీరిద్దరి కలయికకు అవకాశాలున్నాయని చిరంజీవి, పవన్ లకు సన్నిహితంగా ఉండే అభిమాన సంఘం నేత ఒకరు చెప్పడం విశేషం.